అమెరికా జార్జియాలో ఓ చిన్న విమానం కూలిన ఘటనలో ఐదుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఇండియానాలో జరిగే ఒకరి అంతిమసంస్కారాల్లో పాల్గొనేందుకు వీరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఈ ఘటన ఆగ్నేయా అట్లాంటాకు 161 కిలోమీటర్ల దూరంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. విమానంలో మంటలు చెలరేగిన కారణంగా చక్కర్లు కొడుతూ విమానం కుప్పకూలినట్లు ఓ స్థానికుడు తెలిపాడు. కూలే సమయంలో పెద్ద శబ్దం వచ్చినట్లు వెల్లడించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర విభాగ సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేసినట్లు అధికారులు తెలిపారు.
పైపర్ పీఏ 31- టీ విమానం.. ప్లోరిడాలోని విల్లిస్టన్ నుంచి ఇండియానాలోని న్యూక్యాజిల్ ప్రాంతానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:'కొవిడ్ చికిత్సలో హెచ్సీక్యూ ప్రభావం చూపించట్లేదు'