ETV Bharat / international

దేశానికి ప్రథమ పౌరురాలు.. శ్వేత సౌధంలో ఏకాకి! - స్వేత సౌధంలో ఏకాకిగా ట్రంప్ భార్య

అగ్ర రాజ్యానికి అధ్యక్షుడు, సుసంపన్నుడికి భార్యగా ఉంటే కష్టాలేముంటాయిలే.. అని చాలా మంది అనుకుంటారు. అయితే అందరి విషయంలోనూ అది నిజం కాదని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షడు డొనాల్డ్​ ట్రంప్​ భార్య మెలనియా శ్వేతసౌధంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లు ఓ పుస్తకం సంచలన నిజాలు భయటపెట్టింది. అందులో ఉన్న కొన్ని విషయాలు మీ కోసం.

WHITE HOUSE
దేశానికి ప్రథమ పౌరురాలు.. స్వేత సౌధంలో ఏకాకి!
author img

By

Published : Dec 9, 2019, 7:38 AM IST

Updated : Dec 9, 2019, 10:47 AM IST

ఆమె ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా ప్రథమ మహిళ. శ్వేతసౌధానికి పట్టపురాణి! సుసంపన్నుడైన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి. అధ్యక్షుడి భార్య హోదాలో మెలనియా వైట్‌హౌస్‌లో సమస్త రాజభోగాల్ని అనుభవిస్తున్నారని అనుకుంటాం. కానీ దీనికి పూర్తి భిన్నమైన జీవితాన్ని ఆమె ప్రస్తుతం అనుభవిస్తున్నారని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది!! ఒకరకంగా ఆమె వైట్‌హౌస్‌లో ఒంటరి జీవితం గడుపుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఎడమొహం పెడమొహంగా గడుపుతారు. ట్రంప్‌ మొదటిభార్య కుమార్తె ఇవాంకాతోనూ మెలనియాకు సత్సంబంధాల్లేవు. అధ్యక్ష భవనంలో తన పాత్ర విషయంలో ఇవాంకతో ఆమె చాలాసార్లు విభేదించారు కూడా. ఏ అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటనలకు వెళ్లినా, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా.. ప్రథమ మహిళ పక్కన కనిపించేవారు. కానీ ట్రంప్‌ పక్కన మెలనియా అత్యంత అరుదుగానే కనిపిస్తుంటారు. ఒకవేళ కనిపించినా ఎడమొహం పెడమొహంగానే!! విదేశాలకు, అధికారిక కార్యక్రమాలకు చాలావరకు ట్రంప్‌ ఒక్కరే వెళతారు. గత ఏడాది అనారోగ్యంపాలైన మెలనియా దాదాపు మూత్రపిండాన్ని కోల్పోయే స్థితిలోకి వెళ్లిపోయారట! ‘‘ఫ్రీ మెలనియా- ద అనాథరైజ్డ్‌ బయోగ్రఫీ’ పేరుతో సీఎన్‌ఎన్‌ పాత్రికేయురాలు కేట్‌ బెనెట్‌ రాసిన పుస్తకంలో ఈ సంచలన వాస్తవాలు బయటపెట్టారు. వైట్‌హౌస్‌ పాత్రికేయ సిబ్బందిలో ఒకరైన కేట్‌ బెనెట్‌ ఎక్కువగా మెలనియా వ్యక్తిగత విషయాల్ని కవర్‌ చేస్తుంటారు.

WHITE HOUSE
భార్యాభర్తలిద్దరూ ఎడమొహం పెడమొహంగా

స్లొవేనియాలో పుట్టిపెరిగినప్పటి నుంచి ప్రస్తుతం వైట్‌హౌస్‌లో పోషిస్తున్న పాత్ర దాకా మెలనియా జీవితంలోని అన్ని కోణాల్నీ గత మంగళవారం విడుదలైన 288 పేజీల ఈ పుస్తకం తడిమిచూసింది. ‘అత్యంత ప్రైవేటు జీవితం’ గడుపుతున్న మొట్టమొదటి ప్రథమ మహిళ మెలనియానేనని పుస్తకం విశ్లేషించింది. ఈ పుస్తకం బయటికి వచ్చినప్పటి నుంచి మెలనియా తన సొంత ఇంట్లోనే బందీగా గడుపుతున్నారంటూ సామాజిక మాధ్యమాలు హోరెత్తుతున్నాయి.

వేర్వేరు గదుల్లో నిద్ర

WHITE HOUSE
వేర్వేరు గదుల్లో నిద్ర

ట్రంప్‌, మెలనియాలు వైట్‌హౌస్‌లోని వేర్వేరు అంతస్తుల్లో, వేర్వేరు గదుల్లో నిద్రిస్తారని పుస్తకం బయటపెట్టింది. ట్రంప్‌ రెండో అంతస్తులో, మెలనియా మూడో అంతస్తులో పడుకుంటారని, ట్రంప్‌ తన గదికి తాళం వేయాలని సిబ్బందికి చెబుతారని పుస్తకం వివరించింది. మూడో అంతస్తులో మెలనియా కోసం రెండు వేరే గదులున్నాయి. గత అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అత్త మరియన్‌ రాబిన్‌సన్‌ ఆ గదుల్లో ఉండేవారు. మెలనియా మేకప్‌ చేసుకోవడానికి ఒక అలంకరణ గది ఉంది. ఆమె కోసం ప్రైవేటు జిమ్‌ కూడా ఉంది.

ఇవాంక పొడ గిట్టదు!

WHITE HOUSE
"ఐ రియల్లీ డోన్ట్​ కేర్​, యూ" అని రాసి జాకెట్​ను ధరించిన మెలనియా

అమెరికాలో ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్‌ తర్వాత అంతటి శక్తిమంతమైన వ్యక్తి ఆయన కుమార్తె ఇవాంక. ట్రంప్‌ సలహాదారుగా ఆయన వెంట విదేశీ పర్యటనలకు వెళుతుంటారు. దేశంలో మహిళా సంబంధ విషయాలనూ ఆమే చూసుకుంటారు. గత అధ్యక్షుల కాలంలో ఈ పనుల్ని ప్రథమ మహిళ చూసేవారు. ఇప్పుడు ఆ పనుల్లోకి ఇవాంక చొచ్చుకురావడం, ఓవల్‌ ఆఫీస్‌(అధ్యక్షుడి కార్యాలయం)లో క్రియాశీలంగా మెలగడం మెలనియాకు ఎంతమాత్రం రుచించడం లేదు. ఈ విధుల విషయంలో ఇవాంక, మెలనియాల మధ్య పెద్ద సంఘర్షణే నడుస్తోందని పుస్తకం బయటపెట్టింది. ‘‘ఐ రియల్లీ డోన్ట్‌ కేర్‌, డూ యూ’ అని రాసిన జాకెట్‌ను మెలనియా 2018లో ధరించారు. ఈ రాతలు ఇవాంకను ఉద్దేశించే అన్న చర్చ అప్పట్లో జరిగింది. కానీ ఆ జాకెట్‌ సందేశం మీడియాను ఉద్దేశించినది అని ఆ తర్వాత వైట్‌హౌస్‌తో పాటు మెలనియా వివరణ ఇచ్చారు. భర్త ట్రంప్‌ తుంటరి అలవాట్లను ప్రస్ఫుటించే సందేశాలుండే దుస్తుల్ని మెలనియా గతంలో చాలాసార్లు ధరించారు. మెలనియా, ఇవాంక మధ్య బంధం ‘సాదరమే తప్ప సన్నిహితం కాదు’ అని పుస్తకం విశ్లేషించింది.

వైట్‌హౌస్‌ పనుల్లో గడుపుతూ..

మెలనియా ప్రస్తుతం వైట్‌హౌస్‌లో చిన్న చిన్న పనుల్ని పర్యవేక్షిస్తూ పూర్తి వ్యక్తిగత జీవితం గడుపుతున్నారు. వైట్‌హౌస్‌లో క్రిస్‌మస్‌ అలంకరణల్లాంటి పనులు చూస్తున్నారు. సెలవురోజుల్లో వైట్‌హౌస్‌లో చేసే సంబరాలు, అతిథులకు ఆహ్వానం ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సతీమణి కారెన్‌ పెన్స్‌తో కూడా మెలనియాకు సఖ్యత లేదని పుస్తకం వివరించింది.

కొడుకే ముఖ్యం

డొనాల్డ్‌ ట్రంప్‌, మెలనియాలకు 13 ఏళ్ల కుమారుడు బారెన్‌ ఉన్నాడు. ప్రస్తుతం తన ప్రాధాన్యం అతని భవిష్యత్తేనని మెలనియా చెబుతుంటారు. బారెన్‌ గురించిన ప్రస్తావన పుస్తకంలో ఎక్కువగా లేదు. చిన్నపిల్లాడి గురించి బహిరంగ చర్చ జరగకూడదనే తాను ఈ పనిచేసినట్లు పుస్తక రచయిత చెప్పుకొచ్చారు.

టీవీల్లో కనిపించరు

మెలనియా అత్యంత అరుదుగానే టీవీ ఇంటర్వ్యూలు ఇస్తారు. అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టాక.. ఇంతవరకు ఏ ప్రధాన మేగజీన్‌ కవర్‌పేజీ పైనా కనిపించలేదు. మెలనియా సోషల్‌ మీడియా అకౌంట్లను ఆమె సిబ్బంది నిర్వహిస్తుంటారు.

ఇదీ చూడండి:నిరాశ్రయులకు ఇళ్ల నిర్మాణం కోసం రోడ్లపై నిద్ర!

SNTV Digital Daily Planning Update, 0100 GMT
Monday 9th December 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Highlights from the Portuguese Primeira Liga, Belenenses v FC Porto. Already moved.
SOCCER: Reaction from  the Gulf Cup final on Sunday between Saudi and Bahrain from Doha, Qatar. Already moved.
SOCCER: Bundesliga highlights - Andersson on target again in Union win, Hertha held at home by lowly Paderborn. Already moved.
SOCCER: Ljungberg previews Arsenal's visit to West Ham. Already moved.
SOCCER: Highlights from the Greek Superleague, Volos v Panathinaikos. Already moved.
WINTER SPORT: Highlights from women's super-G World Cup in Lake Louise. Already moved.
WINTER SPORT: Highlights from men's giant slalom World Cup in Beaver Creek. Already moved.
WINTER SPORT: Santa Sunday at Sunday River - 250 Santas take to the slopes for charity. Already moved.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Dec 9, 2019, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.