pig heart transplant patient dies: పంది గుండెను మార్పిడి చేయించుకున్న వ్యక్తి.. ప్రాణాలు కోల్పోయాడు. అవయవ మార్పిడి ఆపరేషన్ జరిగిన రెండు నెలలకు అతను చనిపోయాడు. అతనికి సర్జరీ నిర్వహించిన మేరీలాండ్ ఆస్పత్రి ఈ విషయాన్ని ప్రకటించింది. రోగి మృతికి కారణాలు చెప్పలేదు. అయితే, కొద్దిరోజుల ముందు నుంచి అతని ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిందని వైద్యులు తెలిపారు.
అమెరికా మేరీల్యాండ్‌లోని 57ఏళ్ల డేవిడ్ బెన్నెట్‌కు ఈ ఆపరేషన్ నిర్వహించారు వైద్య నిపుణులు. గుండె సమస్య తీవ్రమై చనిపోయే పరిస్థితిలో ఉన్న అతనికి చివరి అవకాశంగా పంది గుండెను అమర్చారు. అయినా అతని ప్రాణాలు నిలవలేదు. ఆపరేషన్ జరిగిన మూడు రోజుల వరకు అతని ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఆ తర్వాత కొన్ని వారాల పాటు అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.
అతడు చాలా కాలం బతికితే భవిష్యత్తులో వైద్య రంగంలో పెను మార్పులు వస్తాయని నిపుణులు భావించారు. అవయవాల కొరత సమస్య తీర్చేందుకు ఇది కీలక ముందడుగు అవుతుందని అనుకున్నారు.
ఇదీ చదవండి: న్యూక్లియర్ ప్లాంట్‌కు కరెంట్ కట్.. ఉక్రెయిన్‌లో డేంజర్ బెల్స్!