ETV Bharat / international

ప్రచార పర్వంలోకి ప్రథమ మహిళ మెలానియా - america trump campaign

అమెరికా ప్రథమ మహిళ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్.. ప్రచార పర్వంలోకి అడుగుపెట్టనున్నారు. పెన్సిల్వేనియాలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ ప్రచార బృందం వెల్లడించింది.

First lady hits campaign trail for Trump
ప్రచార పర్వంలోకి అమెరికా ప్రథమ మహిళ మెలానియా
author img

By

Published : Oct 27, 2020, 5:44 AM IST

అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. ఎన్నికలకు వారం రోజులు గడువు ఉన్న నేపథ్యంలో ట్రంప్ తరపున ప్రచారం చేయనున్నారు. పెన్సిల్వేనియాలోని అట్​గ్లెన్ కౌంటీలో జరిగే కార్యక్రమం​లో పాల్గొననున్నారు.

అధ్యక్షుడి అజెండాను పెన్సిల్వేనియా ప్రజలకు మెలానియా వివరిస్తారని ట్రంప్ ప్రచార బృందం వెల్లడించింది. శ్వేతసౌధ మాజీ కౌన్సెలర్ కెల్లియానే కాన్వే ఈ సభను పర్యవేక్షిస్తారని తెలిపింది.

2019 జూన్ తర్వాత అధ్యక్షుడి ప్రచార కార్యక్రమాల్లో మెలానియా పాల్గొనలేదు. ట్రంప్ రెండో సారి అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు ఓర్లాండోలో బిడ్ దాఖలు చేసిన కార్యక్రమానికి చివరిసారిగా హాజరయ్యారు. నిధుల సమీకరణ కోసం ఈ ఏడాది మార్చిలోనే ప్రచారపర్వంలోకి దిగాల్సిన మెలానియా ప్రణాళికలు కరోనా కారణంగా ఆగిపోయాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.