First female aircraft carrier commander: అమెరికాకు చెందిన 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్' అణ్వాయుధ వాహన నౌకను శాన్ డియాగోలో మోహరించారు. ఈ నౌకకు కెప్టెన్ అమీ బౌర్న్స్చ్మిడ్ట్ నాయకత్వం వహిస్తున్నారు. దీంతో అమెరికా నౌకాదళ చరిత్రలో న్యూక్లియర్ క్యారియర్‌కు నాయకత్వం వహించిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.
అబ్రహం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా.. నావెల్ ఎయిర్ స్టేషన్ నార్త్ ఐలాండ్ నుంచి గత సోమవారం శాన్‌డియాగోలో ఈ నౌకను మోహరించారు.
అబ్రహం లింకన్ నౌక ఎగ్జిక్యూటివ్ అధికారిగా 2016-2019 వరకు విధులు నిర్వర్తించారు అమీ. నౌక నాయకత్వ బాధ్యతలను కెప్టెన్ వాల్ట్ స్లాటర్ నుంచి గత ఏడాది ఆగస్టులో స్వీకరించారు. ఈ సందర్భంగా కెప్టెన్ స్లాటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 'దేశాన్ని రక్షించేందుకు మనల్ని ఎంచుకున్న ప్రజల సంరక్షణ మనకు అప్పగించారని తెలుసుకోవటం కంటే బాధ్యత మరొకటి లేదు. నౌకాదళంలోని అత్యున్నతమైన నౌకకు నాయకత్వం వహించే అవకాశం ఇచ్చినందుకు కెప్టెన్ స్లాటర్‌కు కృతజ్ఞతలు.' అని పేర్కొన్నారు అమీ.
అంతకు ముందు హెలికాప్టర్ మారిటైం స్ట్రేక్ స్క్వాడ్రన్ 70లో కమాండింగ్ అధికారిగా పని చేశారు అమీ. ఆమె ఉద్యోగ జీవితంలో 3,000 గంటలు విమానాలను నడిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఇదీ చూడండి: 'అమెరికా ఆరోపణలు తప్పు.. మా వద్ద అన్ని అణ్వాయుధాలు లేవు!'