కొడుకు హెయిర్ కట్ నచ్చలేదని బార్బర్పైనే కాల్పులకు పాల్పడ్డాడు ఓ తండ్రి. అమెరికా టెక్సాస్‌లోని ఓ క్షౌరశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆ బార్బర్ ఇప్పుడు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదీ జరిగింది.
'కటి' నగరంలోని హౌస్టన్ శివారు ప్రాంతంలోని క్షౌరశాలలో కొడుకుకి క్షవరం చేయించాలని వచ్చిన ఓ వ్యక్తి.. బార్బర్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. బార్బర్‌కు ఆ వ్యక్తికి మధ్య పిల్లాడి క్షవరం విషయంలో వాగ్వివాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుండగుడు మూడు సార్లు బార్బర్‌పై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు అధికారులు.
ఇదీ చూడండి : కార్చిచ్చు: కోలా దాహం తీర్చిన 'నీటి'దాతలు