ETV Bharat / international

జులైలో 30 వేల మందిపై 'మోడెర్నా టీకా' ప్రయోగం! - బ్రెజిల్​ పౌరులపై చైనా కరోనా టీకా ప్రయోగం

కొవిడ్​-19ను నియంత్రించే ఓ టీకాను అమెరికా నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మోడెర్నా కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. జులైలో 30 వేల మందిపై ఫైనల్ టెస్ట్​ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు చైనా కంపెనీ రూపొందించిన కరోనా వ్యాక్సిన్​ ప్రయోగాల్లో బ్రెజిల్ పౌరులు పాల్గొననున్నట్లు సావో పోలో ప్రభుత్వం ప్రకటించింది.

Final tests of some COVID-19 vaccines to start next month
జులైలో మోడెర్నా టీకాకు భారీ పరీక్ష!
author img

By

Published : Jun 12, 2020, 8:18 AM IST

కరోనాకు కళ్లెం వేసే టీకా కోసం యావత్‌ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తున్నవేళ అమెరికాలో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌, మోడెర్నా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాను వచ్చే నెలలో 30 వేల మంది వాలంటీర్లపై ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఇందుకోసం అవసరమైన డోసులను సిద్ధం చేసినట్లు మోడెర్నా తెలిపింది. ఈ టీకా పరీక్షలను మోడెర్నా మార్చిలోనే ప్రారంభించింది. తొలుత 45 మంది వాలంటీర్లపై ప్రయోగించింది. అందులో సానుకూల ఫలితాలు వచ్చినట్లు సమాచారం. వచ్చే నెల్లో భారీఎత్తున నిర్వహించే పరీక్షలతో టీకా అసలు సామర్థ్యం బయటపడే అవకాశముంది.

చైనా- బ్రెజిల్ వ్యాక్సిన్

కరోనా వ్యాక్సిన్​ కోసం చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్​తో బ్రెజిల్​కు చెందిన ఇన్​స్టిట్యూటో బుటాంటన్ కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు సావో పాలో ప్రభుత్వం ప్రకటించింది.

"సినోవాక్ ఇప్పటికే ఓ కరోనా వ్యాక్సిన్​ను రూపొందించి, దానిపై రెండు సార్లు ప్రయోగం కూడా చేసింది. ముందుగా కోతులపై, తరువాత 744 మంది చైనీస్ వాలంటీర్లపై ప్రయోగం చేసి సత్ఫలితాలు సాధించింది. జులైలో లాస్ట్ స్టేజ్​ టెస్టులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే ఈసారి 9,000 మంది బ్రెజిలియన్లు ఈ టెస్టుల్లో పాల్గొననున్నారు. ఈ ప్రయోగం సఫలమైతే, ఆ వ్యాక్సిన్​ను బ్రెజిల్​లోనే తయారుచేయడానికి ఒప్పందం కుదిరింది. బహుశా 2021 ప్రథమార్థంలో ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది."

- జోవా డోరియా, సావో పోలో గవర్నర్​

ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన కరోనా టీకాపై కూడా బ్రెజిల్ పరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందు కోసం సుమారు 2 వేల మంది బ్రెజిలియన్లను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది.

ఇదీ చూడండి: కరోనా రోగికి విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.