ETV Bharat / international

పెన్సిల్వేనియాలోనూ ట్రంప్​కు చుక్కెదురు - అమెరికా అధ్యక్షుడు ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై న్యాయపోరాటం జరుపుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్​నకు పెన్సిల్వేనియా ఫెడరల్​ కోర్టులో అనూహ్య పరిణామం ఎదురైంది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ట్రంప్​ దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టివేసింది న్యాయస్థానం.

Federal judge dismisses Trump campaign's Pennsylvania lawsuit
పెన్సిల్వేనియాలో ఫెడరల్​ కోర్టులో ట్రంప్​నకు చుక్కెదురు
author img

By

Published : Nov 22, 2020, 11:32 AM IST

పెన్సిల్వేనియా ఫెడరల్​ కోర్టులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు చుక్కెదురైంది. పెన్సిల్వేనియాలో పోలైన ఓట్లను చెల్లని వాటిగా గుర్తించాలని ట్రంప్​ వేసిన దావాను ఫెడరల్​ న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ట్రంప్​ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ మాథ్యూ బ్రాన్​ ధర్మాసనం.. ​ పెన్సిల్వేనియాలో ఏ ఒక్క ఓటును వృథాగా పోనివ్వబోమని వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ట్రంప్​ వాదనను కొట్టి పారేసింది. ట్రంప్​ వర్గం నుంచి తనకు బెదిరింపు కాల్స్​ వచ్చాయని ఇటీవల జస్టిస్​ మాథ్యూ అన్నారు.

"ఆరో అతిపెద్ద రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో ఏ ఒక్క ఓటను చెల్లనివాటిగా పరిగణించలేం. ఇక్కడ పోలైన 70 లక్షల ఓట్లను ​ చెల్లనివిగా పరిగణించాలని అధ్యక్షుడు ట్రంప్​ కోరుతున్నారు. ఎన్నికల్లో గందరగోళం జరిగిందని ఆరోపిస్తున్నారు. కానీ, అందుకు సంబంధించి సరైన ఆధారాలను సమర్పించలేకపోయారు. "

-- జస్టిస్​ మాథ్యూ బ్రాన్, పెన్సిల్వేనియా కోర్టు ప్రధాన న్యాయమూర్తి

పెన్సిల్వేనియాలో 81,000 ఓట్ల ఆధిక్యాన్ని జో బైడెన్​ సంపాదించారు. 20 ఎలక్టోరల్​ ఓట్లను కైవసం చేసుకున్నారు.

పెన్సిల్వేనియా కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ట్రంప్​ తరఫు న్యాయవాదులు. విచారణలో తమకు ఆధారాలు సమర్పించే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. పెన్సిల్వేనియా తీర్పును సవాల్​ చేస్తూ తాము సుప్రీం కోర్టుకు వెళతామని పేర్కొన్నారు. ఒబామా నియమించిన ప్రధాన న్యాయమూర్తి ఈ విషయంలో ఇంత త్వరగా నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

జార్జియాలో రీకౌంటింగ్​ కోసం..

జార్జియా ఓట్లను మళ్లీ లెక్కించాలని కోరుతూ ట్రంప్​ వర్గం.. పిటిషన్​ దాఖలు చేసింది. రిపబ్లికన్లకు కంచుకోటగా ఉన్న జార్జియా ఫలితాల్లో ఈసారి అనూహ్యంగా డెమొక్రటిక్​ పార్టీకి పట్టం కట్టారు అక్కడి ఓటర్లు. 12,000 ఓట్ల తేడాతో బైడెన్ ఈసారి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అక్కడ విజేతగా నిలిచారు.

ఇదీ చూడండి:'మిషిగన్​లో బైడెన్​ గెలుపునే ఖరారు చేసేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.