ETV Bharat / international

ఫేస్​బుక్​, వాట్సాప్​ సర్వర్లను వణికిస్తున్న కరోనా - వాట్సాప్ కరోనా

కరోనా ధాటికి ఇళ్లకే పరిమితమైన ప్రజలు సామాజిక మాధ్యమాలను విపరీతంగా వినియోగిస్తున్నారు. అందువల్ల వాటి సర్వర్లు డౌన్ అయిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించి, వినియోగదారులకు అంతరాయం లేని సేవలు అందించడానికి ఫేస్​బుక్... సర్వర్ల సామర్థ్యాన్ని పెంచింది. అలాగే వదంతుల కట్టడికి కృత్రిమ మేధను ఉపయోగిస్తోంది.

Facebook scrambles as use soars in time of isolation
కరోనా వదంతుల కట్టడికి ఫేస్​బుక్ సన్నద్ధం
author img

By

Published : Mar 20, 2020, 2:35 PM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా... సామాజిక మాధ్యమాలనూ వణికిస్తోంది. ఎలా అంటారా? ప్రజలు కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి ప్రస్తుతం ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీనితో ఒక్కసారిగా ఒంటరి అయిపోయిన ఫీలింగ్ వారిని ఆవరిస్తోంది. ఈ ఒంటరితనాన్ని తప్పించుకునేందుకు వారికి ఉన్న ఒకే ఒక మార్గం సోషల్​ మీడియా. అందుకే ఫేస్​బుక్​ వాడకం పెంచారు. వాట్సాప్ వినియోగదారులు వాయిస్, వీడియో కాల్స్​ను విపరీతంగా చేస్తున్నారు. దీనితో ఒక్కసారిగా వాట్సాప్ సర్వర్లుపై భారం పెరిగిపోయింది.

ఒక్కసారిగా పెరిగిపోయిన వినియోగాన్ని ఆయా సోషల్​ మీడియా సర్వర్లు తట్టుకోలేకపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఆయా సంస్థలు నడుంబిగించాయి. వాటిలో ఒకటి సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​.

వాట్సాప్ సామర్థ్యం పెంపు...

ఫేస్​బుక్​ తాజా సమస్యకు పరిష్కారంగా తమ సర్వర్ల సామర్థ్యం పెంచుతోంది. ముఖ్యంగా అనుబంధ యాప్​ అయిన వాట్సాప్ సర్వర్ల సామర్థ్యం పెంచినట్లు స్పష్టం చేసింది.

"ఫేస్​బుక్, వాట్సాప్ చక్కగా, సజావుగా పనిచేసేలా చూసేందుకు మా టీమ్స్ చాలా కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఒంటరిగా ఉన్న ప్రజలు ఇలాంటి సమయంలో అంతరాయంలేని సేవలు కోరుకుంటారు."- మార్క్​ జుకర్​బర్గ్, ఫేస్​బుక్ సీఈఓ

వదంతుల కట్టడికి...

కరోనా వైరస్​ వ్యాప్తిపై వెల్లువెత్తుతున్న వదంతులను కట్టడి చేసేందుకు ఫేస్​బుక్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఫేస్​బుక్, వాట్సాప్​లో... యూజర్ ఫీడ్స్ పైభాగంలో 'అధీకృత కరోనా వైరస్ సమాచారాన్ని' అందించనున్నట్లు పేర్కొంది. తప్పుడు వార్తలను గుర్తించి, తొలగించడానికి కృత్రిమ మేధను కూడా వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఇందుకోసం ఫేస్​బుక్​ ఆరోగ్య సంస్థల సహకారంతో ఒక సమాచార కేంద్రాన్ని రూపొందిస్తోంది. వైద్య నిపుణులు, విద్యావేత్తలు, ప్రముఖులు ద్వారా కరోనా నివారణ మార్గాలను ప్రజలకు తెలియజేస్తుంది. దీనిని అమెరికా, ఐరోపా సహా ఇతర ప్రాంతాల్లోనూ విస్తరించాలని ప్రణాళిక వేస్తోంది.

మిలియన్ డాలర్ల విరాళం

వాట్సాప్​లో కరోనాపై తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు... 'ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్​వర్క్​'కు 1 మిలియన్ డాలర్ల విరాళం కూడా అందించినట్లు ఫేస్​బుక్ హెల్త్ హెడ్​ కాంగ్-జింగ్ జిన్ తెలిపారు.

ఇదీ చూడండి: '2020-21లో భారత వృద్ధి రేటు 5.1శాతమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.