గతేడాది అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య 130కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్లు ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ఫేస్‌బుక్ సోమవారం వెల్లడించింది. తమ సామాజిక మాధ్యమ వేదికపై తప్పుడు, నకిలీ సమాచార వ్యాప్తిని కట్టడి చేసేందుకు దాదాపు 35వేల మందికి పైగా పనిచేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఫేస్‌బుక్ తమ బ్లాగ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. కరోనా వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారం చేరవేసేలా ఉన్న 12 మిలియన్లకు పైగా పోస్టులు, వీడియోలను తొలగించినట్లు సంస్థ ఈ సందర్భంగా తెలిపింది.
గతేడాది ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో వైరస్, కొవిడ్ వ్యాక్సిన్లపై సోషల్‌మీడియాలో అనేక వదంతులు, తప్పుడు కథనాలు వ్యాపించాయి. అయితే ఈ కథనాలపై ప్రపంచ ఆరోగ్య నిపుణుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవడం వల్ల ఆయా సంస్థలు చర్యలు చేపట్టాయి. నకిలీ వార్తలపై దృష్టిపెట్టి ఆయా ఖాతాలు, పోస్టులను తొలగించాయి.
ఇదీ చూడండి: 'ఆసీస్ తరహా చట్టంతో వార్తలకు డబ్బు వసూలు!'