ETV Bharat / international

Facebook Papers Leak: పాండోరా తరహాలో 'ఫేస్​బుక్' పేపర్స్ ప్రకంపనలు - facebook news today

పాండోరా పేపర్స్​ తరహాలో ఇప్పడు ఫేస్​బుక్ పేపర్స్(facebook papers leak) సంచలనంగా మారాయి. అమెరికా సహా భారత్​లో విద్వేష ప్రసంగాల(facebook hate speech) వ్యాప్తిని ఫేస్​బుక్​ అడ్డుకోలేకపోతోందని, ప్రజాప్రయోజనాల కంటే దానికి లాభాలే ముఖ్యమని ఈ పత్రాలు బహిర్గతం చేశాయి. భారత్​లో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఫేస్​బుక్(facebook papers) అనుకూలంగా వ్యవరిస్తోందని వెల్లడించాయి.

EXPLAINER: What are 'The Facebook Papers'?
పాండోరా తరహాలో 'ఫేస్​బుక్' పేపర్స్ ప్రకంపనలు
author img

By

Published : Oct 25, 2021, 8:19 PM IST

Updated : Oct 25, 2021, 9:38 PM IST

'పాండోరా పేపర్స్' సృష్టించిన ప్రకంపనలు మరువకముందే ఇప్పుడు 'ఫేస్​బుక్ పేపర్స్'(facebook papers leak) బయటపెట్టిన రహస్యాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఫేస్​బుక్​కు ప్రజాప్రయోజనాల కంటే లాభార్జనే ముఖ్యమని ఇవి బట్టబయలు చేశాయి. ఈ ఉద్దేశంతోనే కంపెనీ అంతర్గత పరిశోధన(facebook research papers) వివరాలను ఇన్వెస్టర్లకు, ప్రజలకు తెలియకుండా ఫేస్​బుక్ దాస్తోందని వెల్లడించాయి.

అమెరికాలోని అసోసియేటెడ్ ప్రెస్ సహా 17 వార్తా సంస్థలు జట్టుకట్టి ఫేస్​బుక్ పేపర్స్ ప్రాజెక్టును(facebook papers) చేపట్టాయి. సామాజిక మాధ్యమ సంస్థకు సంబంధించి వేలాది అంతర్గత పత్రాల సమాచారాన్ని వెలికితీశాయి. ఫేస్​బుక్ మాజీ ప్రొడక్ట్ మేనేజర్​, సంస్థ విధానాలపై గళమెత్తిన ఫ్రాన్సెస్​ హ్యూగెన్(Facebook whistleblower ) ద్వారా ఈ పత్రాలను పొందగలిగాయి. ఐరోపా వార్తా సంస్థల కన్జార్టియానికి కూడా ఈ ఫేస్​బుక్ పేపర్స్ సమాచారం పొందేందుకు యాక్సెస్ ఉంది.

ఈ పత్రాలకు సంబంధించిన విశ్లేషణను అమెరికా, ఐరోపా వార్తా సంస్థలు సోమవారం(అక్టోబర్​ 25న) ప్రచురించడం ప్రారంభించాయి. ఇందులో భారత్​తో పాటు అనేక దేశాల్లో ఫేస్​బుక్​ స్వార్థప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్లు కుండబద్దలు కొట్టాయి. ఇదే విషయాన్ని ఫ్రాన్సెస్​ హ్యూగెన్ కూడా గత కొన్ని నెలలుగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్​ కమిషన్(ఎస్​ఈసీ) దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించాయి. ఫేస్​బుక్​ ప్రజాప్రయోజనాల కంటే లాభార్జనకే ప్రాధాన్యమిస్తున్నట్లు హ్యూగెస్​ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాయి.

తమ యూజర్ల సంఖ్యను పెంచుకునేందుకు ఫేస్​బుక్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది? ఈ సామాజిక మధ్యమం వల్ల పిల్లలకు ఎలాంటి హాని కలుగుతుంది? రాజకీయ హింసలో దీని పాత్ర ఎలా ఉంది? వంటి విషయాలపై ఈ పత్రాల్లో ఉంది. క్యాపిటల్ భవనం హింస ఘటన దర్యాప్తులో భాగంగా అమెరికా కాంగ్రెస్ సభ్యుల ముందు కూడా ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఉంచారు.

మోదీకి అనుకూలంగా..

  • భారత్​తో విద్వేష ప్రసంగాలు(facebook hate speech), తప్పుడు సమాచారం, హింసను ప్రేరేపించే పోస్టులను కట్టడి చేసే విషయంలో ఫేస్​బుక్ సెలక్టివ్​గా వ్యవహరించిందని అసోసియేటెడ్ ప్రెస్ బయటపెట్టిన పత్రాలు తేటతెల్లం చేశాయి. ప్రత్యేకించి ఓ వర్గానికి వ్యతిరేక కంటెంట్​ విషయంలో ఇలా చేసిందని వెల్లడించాయి. సంస్థ ఉద్దేశాలు, ప్రయోజనాలు ఏంటనే విషయంపై అక్కడి ఉద్యోగులకే అనుమానాలు తెలెత్తినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.
  • 2019 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఫేస్​బుక్​ నిర్వహించిన అంతర్గత పరిశోధనల్లో(facebook research papers) భారత్​లో అభ్యంతరకర కంటెంట్​ను సంస్థ తొలగించలేకపోతోందని తేలినట్లు పత్రాలు పేర్కొన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఫేస్​బుక్​ అతిపెద్ద మార్కెట్​ అయిన భారత్​లో.. సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషాలు పెరిగి హింస హెచ్చరిల్లిన చరిత్ర ఉందని పేర్కొన్నాయి.
  • ఫేస్​బుక్​కు(Facebook news ) ఈ సమస్యలపై చాలా ఏళ్లుగా అవగాహన ఉన్నప్పటికీ.. వాటిని పరిష్కరిచేందుకు సంస్థ చేసిన ప్రయత్నాలపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో ఫేస్​బుక్ విఫలమైందని చాలా మంది క్రిటిక్స్, డిజిటల్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ భాజపాతో సంబంధమున్న వ్యవహారాల్లో సమస్యలను ఫేస్​బుక్​ పరిష్కరించలేకపోయింది.
  • ప్రపంచ దేశాల రాజకీయాల్లో ఫేస్​బుక్​(facebook papers leak news ) కీలకంగా మారింది. భారత్​లో కూడా అదే పరిస్థితి ఉంది.
  • ఎన్నికల సమయంలో మోదీ ఫేస్​బుక్​ వేదికను తనకు అనూకూలంగా మలుచుకున్నారు. భాజపా నుంచి సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే విద్వేష ప్రసంగాల విషయంలో ఫేస్​బుక్ సెలక్టివ్​గా వ్యవహరిస్తుందని గతేడాది వాల్​స్ట్రీట్ జర్నల్ అనుమానం వ్యక్తం చేసింది. 2015లో ఫేస్​బుక్ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ, సంస్థ సీఈఓ మార్క్​ జుకర్​బర్గ్ ఆలింగనం చేసుకున్నారు. కాసేపు ఉల్లాసంగా గడిపారు.
  • ప్రపంచంలో రిస్కులో ఉన్న దేశాల్లో భారత్​ను ఒకటిగా ఫేస్​బుక్​ చూసింది. హిందీ, బెంగాలీ భాషల్లో విద్వేష ప్రసంగాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించింది. అయినా వీటి తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన సంఖ్యలో లాంగ్వేజ్ మోడరేటర్లను నియమించుకోలేదు. విద్వేష ప్రసంగాలను అరికట్టేందుకు సాంకేతిక సాయం కోసం భారీగా వెచ్చించినట్లు ఫేస్​బుక్ అసోసియేటెడ్ ప్రెస్​కు తెలిపింది. 2021లో ఇలాంటి కంటెంట్​ 50శాతం తగ్గుతుందని పేర్కొంది.

క్యాపిటల్ ఘటన

  • జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంలో హింస చెలరేగిన సమయంలో ఫేస్​బుక్​ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని పత్రాలు పేర్కొన్నాయి. తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే ప్రసంగాల వ్యాప్తిని నిలువరించేలేకపోయిందని తెలిపాయి. అమెరికాలో అతివాద భావజాలం పెరుగుతున్నట్లు తెలిసినా ఫేస్బుక్ చర్యలు చేపట్టలేకపోయిందని బహిర్గతం చేశాయి.
  • గతేడాది గాజా యుద్ధ సమయంలోనూ ఫేస్​బుక్ మాతృ సంస్థగా ఉన్న ఇన్​స్టాగ్రాం #AlAqsa ట్యాగ్​ను తాత్కాలికంగా బ్యాన్ చేసింది. ఆ తర్వాత ఫేస్​బుక్ క్షమాపణలు కూడా చెప్పింది. ప్రపంచంలో మూడో పవిత్ర ప్రదేశమైన జెరుసలేంలోని Al-Aqsa మసీదును తమ అల్గారిథంలు ఉగ్రవాద సంస్థ పేరుగా భావించినందు వల్ల పొరపాటుగా ఇలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. అరబ్​ భాషను పేస్​బుక్​లో ఎక్కువగా వాడుతున్నప్పటికీ సంస్థ ఎన్నోసార్లు అరబ్​కు సంబంధించిన పోస్టులను తప్పుగా భావించి తొలగించింది. రాజకీయ ప్రసంగాలపై సంస్థ తీరు ఎలా ఉంటుందని చెప్పేందుకు ఇదే నిదర్శనం.

ఇదీ చదవండి: 'భారత ఎన్నికల్లో ఫేస్​బుక్​ జోక్యం'- జేపీసీ విచారణకు కాంగ్రెస్​ డిమాండ్​

Last Updated : Oct 25, 2021, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.