ETV Bharat / international

'అందరికీ టీకా' కావాలంటే ఒకే డోసు తీసుకోవాలా? - టీకా డోసేజీ అంశాలు

కరోనా మహమ్మారిని గెలిచే 'టీకాస్త్రం' సిద్ధమైంది. అనేక దేశాలు వ్యాక్సినేషన్​ ప్రక్రియ చేపట్టాయి. అయితే.. డోసుల విషయంలోనే కొత్త చిక్కులొచ్చి పడుతున్నాయి. వ్యాక్సిన్ల కొరతే ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే రెండో డోసును వాయిదా వేయాలన్న బ్రిటన్​ నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు?

Vaccine dosing debates add to public confusion
టీకా విషయంలో బ్రిటన్​ నిర్ణయం... అంతటా గందరగోళం!
author img

By

Published : Jan 5, 2021, 7:27 PM IST

టీకాలు వచ్చేశాయి! కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే వ్యాక్సిన్​ అందరికీ అందడమే తరువాయి. అమెరికాలో చాలా మంది ఇప్పటికే రెండో డోసు కూడా పొందుతున్నారు. అయితే.. బ్రిటన్​ నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎక్కువ మందికి టీకా తొలి డోసును అందించాలన్న ఉద్దేశ్యంతో.. రెండో డోసు(బూస్టర్​ డోసు)ను వాయిదా వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 3-4 వారాల కాలవ్యవధిని 12 వారాలకు పెంచాలని వైద్యాధికారులు నిర్ణయించారు. వ్యాక్సిన్ల కొరతనే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

ఈ నిర్ణయంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఒక డోసుతో వైరస్​ నుంచి రక్షణ లభిస్తుందా? డోసుల మధ్య వ్యవధి ఎక్కువైతే ఏమవుతుంది వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై వైద్యులు ఏమంటున్నారు.

రెండు డోసులతోనే సంపూర్ణ రక్షణా..?

వివిధ దేశాల్లో పలు టీకాలను అత్యవసర వినియోగం కోసం అనుమతించారు. అమెరికాలో ఫైజర్​- జర్మనీకి చెందిన బయోఎన్​టెక్ సంయుక్తంగా​ రూపొందించిన టీకాతో పాటుగా, మోడెర్నా టీకాకు అనుమతి లభించింది. బ్రిటన్​లో ఫైజర్​తో పాటుగా, ఆక్స్​ఫర్డ్​- ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాను అందిస్తున్నారు. మనదేశంలో భారత్​ బయోటెక్​ రూపొందించిన కొవాగ్జిన్​, ఆక్స్​ఫర్డ్​-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్​ టీకాలకు ఇటీవలే డీసీజీఐ ఆమోదముద్ర వేసింది. ఈ టీకాలన్నీ రెండు డోసులతో వైరస్​ నుంచి సంపూర్ణ రక్షణ అందిస్తాయని నిరూపితమయ్యాయి. మొదటి డోసు తీసుకున్న 3 లేదా 4 వారాల వ్యవధిలో రెండో డోసును తీసుకోవాల్సి ఉంటుంది.

రెండు డోసుల మధ్య ఎక్కువ సమయం తీసుకుంటే?

మొదటి డోసుకు, రెండో డోసుకు మధ్య 12 వారాల వ్యవధి ఏర్పడినా ఏమీ కాదని బ్రిటన్​కు చెందిన వైద్యాధికారులు గత వారం నిర్ణయించారు. ఇలా బూస్టర్​ డోసును వాయిదా వేయడం వల్ల ఎక్కువ మందిని వైరస్​ నుంచి రక్షించగలుగుతామని వారు చెబుతున్నారు. రెండు డోసుల మధ్య ఈ స్వల్ప కాలవ్యవధి ఏర్పడితే.. దీర్ఘకాలంలో మంచిదేనని ఆస్ట్రాజెనెకా సంస్థ చేసిన ప్రచురితం కాని ఓ అధ్యయనం సూచిస్తోందని వారు అంటున్నారు. అయితే బ్రిటన్​ తీసుకున్న ఈ నిర్ణయం.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

మొదటి డోసు తీసుకుంటే వైరస్​ నుంచి రక్షణ లభించినట్టేనా?

టీకా మొదటి డోసు తీసుకున్న 21 రోజుల తర్వాత దాని ప్రభావం ఇంకా కొనసాగుతుందనడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని 'ఫైజర్'​ సంస్థ చెబుతోంది. అందుకే.. అమెరికాలో షెడ్యూల్​ ప్రకారం అందరికీ రెండో డోసు వేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆరోగ్య, మానవ సేవల కార్యదర్సి అలెక్స్​ అజర్​ చెప్పారు.

డోసేజీ పరిమాణాన్ని తగ్గించడం వల్ల టీకా అందరికీ పంపిణీ చేయవచ్చా?

మోడెర్నా టీకా రెండు డోసులను సగం సగం ఇచ్చినా.. సమర్థవంతంగానే పనిచేస్తున్నట్లు తెలుస్తోందని అమెరికా వ్యాక్సిన్​ కార్యక్రమ సలహాదారు డాక్టర్​ మోన్సెఫ్​ స్లావోయ్​ చెప్పారు. 18 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తుల్లో.. తక్కువ డోసుతోనూ రోగనిరోధక శక్తి వచ్చిందని అన్నారు. ఈ అంశంపై మోడెర్నాతో, అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్​డీఏ) చర్చిస్తున్నట్లు చెప్పారు.

అయితే.. అతి తక్కువ మందిపై జరిపిన అధ్యయనం ఆధారంగా.. స్లావోయ్​ ఈ విషయాన్ని సూచిస్తున్నారు. కానీ, 30,000 మందిపై చేసిన అధ్యయనం ఆధారంగా.. మోడెర్నా టీకాకు అమెరికా ఎఫ్​డీఏ ఆమోదించింది. ఆ అధ్యయనంలో 28 రోజుల వ్యవధిలో రెండో డోసు తీసుకున్నప్పుడే.. వైరస్​ నుంచి టీకా 95 శాతం సమర్థవంతంగా ఉంటుందని నిర్ధరించారు. ఈ నేపథ్యంలో.. తాము ఇప్పుడే ఈ విషయం గురించి ఏమీ చెప్పలేమని 'మోడెర్నా' సంస్థ ప్రతినిధి రాయ్​ జోర్డాన్​ అన్నారు.

డోసేజీలను తగ్గించడం, వాయిదా వేయడం చేస్తే.. వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందా?

ఇలాంటి చర్యల వల్ల కరోనా బారిన పడకుండా ఉంటామని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అమెరికాలో మొదటగా నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం టీకాలను పంపిణీ చేయలేకపోయారు. ఇప్పటివరకు మొత్తం 1.5 కోట్ల డోసులను వివిధ రాష్ట్రాలకు సరఫరా చేయగా.. సోమవారం నాటికి అమెరికాలో 45 లక్షలకు పైగా మందికి మాత్రమే టీకా వేశారు. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ప్రాధాన్య క్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బందికి, నర్సులకు టీకాలు వేస్తున్నారు.

ఇదీ చూడండి:కొవిడ్‌ టీకాతో ఇమ్యూనిటీ ఎప్పుడు వస్తుందంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.