కాబుల్ విమానాశ్రయం వద్ద జంట ఆత్మాహుతి పేలుళ్లకు(kabul airport blast) పాల్పడింది తామే అని ప్రకటించింది ఐసిస్-కే(isis-k attacks) ఉగ్రసంస్థ. ఈ ఘటనలో 100కుపైగా ప్రాణాలను బలిగొన్న ఈ సంస్థ ఎప్పుడు, ఎలా పుట్టింది? తాలిబన్లకు, ఈ వర్గానికి అస్సలు పడదా? వారి మారణహోమం వెనుక ఉద్దేశం ఏంటి? భవిష్యత్తులో ప్రపంచానికి పెను ముప్పుగా ఈ తీవ్రవాద సంస్థ పరిణమిస్తుందా? అనే సందేహాలకు అమెరికా ఉగ్రవాద నిర్మూలన నిపుణులు అమిరా జదూన్, ఆండ్రూ మైన్స్ సమాధానాలిచ్చారు. గత కొన్నేళ్లుగా ఐసిస్-కే కార్యకలాపాలను వీరు నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఐసిస్-కే అంటే?
ఐసిస్-కే అంటే ఇస్లామిక్ స్టేక్ ఖోరసన్ ప్రావిన్స్(isis khorasan). దీన్నే ఐసిస్-కే, ఐసిస్కేపీ, ఐఎస్కే అని కూడా పిలుస్తుంటారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా(ఐసిస్) ఉగ్రసంస్థకు ఇది అనుబంధ సంస్థ. 2015 జనవరిలో ఐసిస్-కేను స్థాపించారు. అతి తక్కువ కాలంలో ఉత్తర, ఈశాన్య అఫ్గాన్‌లోని గ్రామీణ జిల్లాలు సహా ప్రాదేశిక నియంత్రణను ఏకీకృతం చేసింది. మొదటి మూడేళ్లలో అఫ్గాన్, పాకిస్థాన్‌లోని మైనారిటీ వర్గాలు, ప్రభుత్వ సంస్థలు లక్ష్యంగా దాడులతో రెచ్చిపోయింది. 2018 నాటికే ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర ఉగ్రసంస్థల్లో నాలుగో స్థానంలో నిలిచింది.
అయితే అమెరికా నేతృత్వంలోని అప్గాన్ దళాలు దాడులు చేయడం వల్ల ఐసిస్-కేకు తీరని నష్టం వాటిల్లింది. ఈ సంస్థ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 1400 మంది అఫ్గాన్ ప్రభుత్వం ముందు 2019-2020 మధ్య కాలంలో లొంగిపోయారు.
ఎవరు స్థాపించారు?
పాకిస్థానీ తాలిబన్ మాజీ సభ్యులు, అఫ్గాన్ తాలిబన్, ఉజ్బేకిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమకారులు ఐసిస్-కేను(isis-k leadership) స్థాపించారు. కాలక్రమేణా ఇతర మిలిటెంట్ గ్రూప్‌లకు చెందిన వారిని కూడా కలుపుకొంటూ వెళ్లారు.
స్థానికంగా అత్యంత నైపుణ్యం, శక్తిసామర్థ్యాలు కలిగిన కమాండర్లు, సభ్యులు ఉండటం ఈ సంస్థ బలం. ఐసిస్-కే మొదట నంగరర్హర్ ప్రావిన్సు దక్షిణాది జిల్లాలను తమ నియంత్రణలోకి తెచ్చుకుంది. అఫ్గాన్ ఈశాన్య సరిహద్దు పాకిస్థాన్ సరిహద్దు కలిసే ఇక్కడి టోరా బోరా ప్రాంతపై గతంలో అల్‌ఖైదాకు మంచి పట్టుండేది. ఈ సరిహద్దు నుంచే తమకు కావాల్సిన వాటిని పొందేది. పాకిస్థాన్ గిరిజన ప్రాంతాల నుంచి నియామకాలు చేపట్టి తమ గ్రూప్‌లో చేర్చుకునేది.
ఇస్లామిక్ స్టేట్ నుంచే ఐసిస్-కేకు ఆర్థిక సాయం, సలహాలు-సూచనలు, శిక్షణా సహకారం అందేవని ఆధారాలున్నాయి. నిపుణుల ప్రకారం ఈ సంస్థకు ఐసిస్ నుంచి దాదాపు 100 మిలియన్ డాలర్లు సమకూరాయి.
ఐసిస్-కే లక్ష్యమేంటి?
ఇస్లామిక్ స్టేట్ ఉద్యమాన్ని మధ్య, దక్షిణాసియాకు విస్తరించడమే ఐసిస్-కే లక్ష్యం. దీని కోసం ప్రధాన కేంద్రాన్ని నెలకొల్పాలని భావిస్తోంది. జిహాదీ సంస్థల వారసత్వాన్ని స్వాధీనం చేసుకుని తామే అగ్రగామిగా అవతరించేందుకు ఐసిస్-కే ప్రయత్నిస్తోంది. అందుకే తమతో కలసిరావాలని వెటరన్ జిహాదీ ఫైటర్లు, పట్టణ ప్రాంతాల్లోని యువతకు సందేశాలు పంపుతోంది. ఇతరు గ్రూప్‌లతో కలిసి అఫ్గాన్(isis-k afghanistan)లోని హజారాలు, సిక్కులు, జర్నలిస్టులు, భద్రతా సిబ్బంది లక్ష్యంగా విధ్వంసకర దాడులకు పాల్పడుతోంది. ప్రజలకు ప్రభుత్వం భద్రత కల్పించలేదనే భావన తీసుకువచ్చేలా, ఇతర గ్రూప్‌ల వారు తమతో చేరేలా భయభ్రాంతులు, అస్థిరత సృష్టించడమే ఐసిస్-కే లక్ష్యం.
తాలిబన్లతో ఐసిస్-కే సంబంధాలు ఎలా ఉంటాయి?
తాలిబన్ల(taliban latest news)ను ఐసిస్-కే వ్యూహాత్మక ప్రత్యర్థిగా చూస్తుంది. వారిని కేవలం అధికారం కోసం పరితపించే 'హీనమైన జాతీయవాదులు'గా భావిస్తుంది. ఇస్లామిక్ స్టేట్ ఉద్యమ లక్ష్యానికి తాలిబన్లు విరుద్ధమని వారిని శత్రువులుగానే పరిగణిస్తుంది.
తాలిబన్లపై దాడులకు దిగుతూనే(isis in afghanistan) వారిని తమలో చేర్చుకునేందుకు ఐసిస్-కే ప్రయత్నించింది. ఈ విషయంలో కొంత సఫలీకృతమైనప్పటికీ, తాలిబన్లు ప్రతిదాడులకు దిగి ఐసిస్-కేను కొంతవరకు దెబ్బతీశారు.
అఫ్గాన్‌కు, అంతర్జాతీయ సమాజానికి ఎంత ప్రమాదకరం?
బలహీనంగా ఉన్న తమ సంస్థను బలపరచుకోవడమే ఐసిస్-కే తక్షణ కర్తవ్యం. అందుకే హై-ప్రొఫైల్ దాడులు జరపాలని భావించవచ్చు. అమెరికా సహా దాని మిత్రదేశాలపై దాడులు చేసేందుకు ఆసక్తికనబరవచ్చు. అయితే ఐసిస్-కే అమెరికా(US vs isis)పై ప్రత్యక్ష దాడులు జరిపేంత శక్తి సామర్థ్యాలున్నాయా అనే విషయంపై ఆ దేశ సైన్యం, నిఘా విభాగంలో భిన్నాభిప్రాయాలున్నాయి.
అయితేే ఐసిస్-కే వల్ల అప్గాన్‌కు మాత్రం పెద్ద ముప్పే పొంచి ఉంది. మైనారిటీలు, ప్రభుత్వ సంస్థలపై దాడులు ఎక్కువ జరగవచ్చు. ఈ ఏడాది కాబుల్‌లో అమెరికా రాయబారిని చంపేందుకు కూడా ఈ సంస్థ ప్రయత్నించింది.
అఫ్గాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవాలనే అమెరికా(us withdrawal from afghanistan) నిర్ణయం.. ఐసిస్-కేకు ఎంత మేర ప్రయోజనం చేకూర్చుతుందో ఇప్పుడే చెప్పడం కష్టమని నిపుణులు అంటున్నారు. భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలను కొనసాగిస్తుందని తెలిపారు. కాబుల్ విమానాశ్రయంపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమన్నారు. తాలిబన్లు అఫ్గాన్‌కు భద్రత కల్పించరని ఐసిస్ నిరూపించాలనుకుంటుందని అభిప్రాయపడ్డారు.