ETV Bharat / international

ట్రంప్​పై 'శాశ్వత వేటు' సాధ్యమేనా?

author img

By

Published : Jan 14, 2021, 6:25 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై అభిశంసన అస్త్రాన్ని ప్రయోగించిన డెమొక్రాట్లు.. ఆయన మరోమారు ఆ పదవిని చేపట్టకుండా శాశ్వత వేటు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం వీరి వద్ద ఉన్న అవకాశాలేంటి? ఆ అస్త్రాలను ప్రయోగిస్తే ట్రంప్​పై శాశ్వత వేటు తప్పదా?

EXPLAINER: Barring Trump from holding office again
ట్రంప్​పై శాశ్వత వేటుకు డెమొక్రాట్లు సన్నద్ధం

'అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై రెండోసారి అభిశంసన..' ఈ వార్త విన్నవారెవరికైనా ఓ సందేహం కలుగుతుంది. 'అధ్యక్షుడిగా చివరి రోజుల్లో ఉన్న ట్రంప్​పై అభిశంసించడం అవసరమా?' అని అనుకుంటారు. అయితే ఇందుకు డెమొక్రాట్లు ఓ సమాధానం ఇచ్చారు. ఈ అభిశంసన.. తదుపరి తరాలకు ఓ హెచ్చరికలా ఉంటుందన్నారు. కానీ డెమొక్రాట్లు కేవలం అభిశంసనతో ఆగేట్టు కనిపించడం లేదు. అధికారం చేపట్టకుండా ట్రంప్​పై శాశ్వత వేటు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు మరో అవకాశం ఉన్న ట్రంప్​ను అడ్డుకునేందుకు డెమొక్రాట్ల వద్ద ఉన్న అస్త్రాలేవీ?

అసలు అభిశంసన అస్త్రం నెగ్గుతుందా?

ప్రతినిధుల సభ.. ట్రంప్​పై అభిశంసను బుధవారం అమోదించింది. అయితే అధ్యక్షుడిని ఆ పదవి నుంచి తొలగించాలంటే.. సెనేట్​లో మూడింట రెండొంతుల మెజారిటీతో అభిశంసన తీర్మానం గట్టెక్కాలి. 2019లో ట్రంప్​పై వేసిన అభిశంసన.. సెనేట్​ను దాటడంలో విఫలమైంది. సెనేట్​లో రిపబ్లికన్లు మెజారిటీగా ఉండటమే ఇందుకు కారణం. అప్పుడు కేవలం ఒకే ఒక్క రిపబ్లికన్​(మిట్​ రామ్నీ) ట్రంప్​కు వ్యతిరేకంగా ఓటు వేశారు.

ఇదీ చూడండి:- అనిశ్చితి, ఆంక్షల నడుమ బైడెన్​ ప్రమాణం!

అయితే ఈసారి పరిస్థితులు మారే అవకాశముంది. క్యాపిటల్​ హింసకు ప్రేరేపించారన్న కారణంగా ట్రంప్​పై అనేక మంది రిపబ్లికన్లు ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుత సమీకరణలను దృష్టిలో పెట్టుకుంటే.. ట్రంప్​పై వేసిన అభిశంసన సెనేట్​ను దాటడానికి 17మంది రిపబ్లికన్ల ఓట్లు అవసరం.

అభిశంసనకు గురైతే శాశ్వత వేటు పడినట్టేనా?

లేదు. అధ్యక్ష కార్యాలయం నుంచి ఓ అధ్యక్షుడిని శాశ్వతంగా తొలగించాలంటే.. వేరే ప్రక్రియ ఉంటుంది. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఏ అధ్యక్షుడిపైనా శాశ్వత వేటు పడలేదు.

అయితే పలువురు న్యాయమూర్తులపై శాశ్వత వేటు పడింది. వారిని తొలగించేందుకు.. అభిశంసన అనంతరం మరోమారు ఓటింగ్​ నిర్వహించారు.

ఇదీ చూడండి:- 'ఆ దాడి చేసింది నా మద్దతుదారులు కాదు'

ఈ ప్రక్రియ ద్వారా ట్రంప్​ను తొలగిస్తే.. ఆయన న్యాయస్థానానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది. ఈ నెల 20తో అధ్యక్షుడిగా ట్రంప్​ పదవీకాలం ముగుస్తుంది. 19వ తేదీ వరకు సెనేట్​ సమావేశాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో ఓ మాజీ అధ్యక్షుడిపై సెనేట్​లో అభిశంసన ప్రక్రియ జరపవచ్చా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

శాశ్వత వేటుకు ఇదొక్కటే మార్గమా?

లేదు. కాంగ్రెస్​ సభ్యుల వద్ద మరో సులభమైన మార్గమే ఉందని యేలే లా స్కూల్​ ప్రొఫెసర్​ బ్రూస్​ ఎకర్​మెన్​, ఇండియానా వర్సిటీ లా ప్రొఫెసర్​ గెరార్డ్​ మగ్లియోకా.. వాషింగ్టన్​ పోస్ట్​కు రాసిన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. 14వ సవరణలోని సెక్షన్​ 3ని ప్రస్తావించారు. రాజ్యాంగంపై తిరుగుబాటుకు పాల్పడ్డ వారిని అధ్యక్ష కార్యాలయం నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తుంది ఈ సెక్షన్​ 3.

ఇదీ చూడండి:- మరో అపఖ్యాతిని మూటగట్టుకున్న ట్రంప్​

ట్రంప్​ తిరుగుబాటుకు పాల్పడ్డారని.. రెండు సభల్లో మెజారిటీ వంతు భావిస్తే.. ఇక ఆయన ఎప్పటికీ అధ్యక్ష బరిలో నిలవరేని ప్రొఫెసర్లు పేర్కొన్నారు.

అయితే రెండు సభల నిర్ణయాన్ని తిరగరాసేందుకు కూడా వీలుంది. ఇందుకోసం కాంగ్రెస్​లోని ప్రతి సభలో మూండిట రెండొంతుల ఓట్లు అవసరం ఉంది.

14వ సవరణ ఎప్పుడొచ్చింది?

దేశంలో జరిగిన అంతర్యుద్ధం అనంతరం అమెరికా రాజ్యాంగానికి చేసిన మూడు సవరణల్లో ఈ 14వ సవరణ ఒకటి. బానిసత్వాన్ని తొలగించి, నల్లజాతీయులకు సమాన హక్కులను కల్పిస్తుంది ఈ సవరణ. అంతర్యుద్ధం సమయంలో.. తిరుగుబాటుకు పాల్పడిన వారు.. అనంతర కాలంలో అధికారం చేపట్టకుండా ఉండేందుకు ఈ సెక్షన్​ 3ని 14వ సవరణకు జోడించి ఉండొచ్చని ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు.

అయితే 1872లో ఆమోదించిన అమ్నెస్టీ చట్టం ద్వారా.. వేటుకు గురైన వారికి తిరిగి అవకాశం కల్పించారు. అమెరికా రాజ్యాంగంలో సెక్షన్​ 3 మాత్రం ఇంకా కొనసాగుతోంది.

ఇదీ చూడండి:- హెచ్​-1బీపై ట్రంప్​ లాస్ట్​ పంచ్​- వారికే లాభం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.