ETV Bharat / international

2021 ఏప్రిల్ నాటికి అందరికీ కరోనా వ్యాక్సిన్

2021 ఏప్రిల్ నాటికి అమెరికా ప్రజలందరికీ కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు చివరి దశలో ఉన్నాయని వాటిని ఆమోదించిన వెంటనే టీకాను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

Expect to have enough COVID-19 vaccines for every American by April 2021: Trump
అమెరికాలో 2021 ఏప్రిల్​ నాటికి కరోనా వ్యాక్సిన్​
author img

By

Published : Sep 19, 2020, 10:13 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వ్యాక్సిన్​పై కీలక వ్యాఖ్యలు చేశారు. 2021 ఏప్రిల్ నాటికి అమెరికాలోని అందరికీ టీకా పంపిణీ అవుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్​ను ఆమోదించిన వెంటనే ప్రభుత్వం.. అమెరికన్లందరికీ టీకాను అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు. ప్రతి నెల కోటీ డోసులు సిద్ధమవుతాయని పేర్కొన్నారు.

అమెరికాలోని వైద్యులు, శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు వీలైనంత త్వరగా టీకాను అభివృద్ధి చేయాలి. అప్పుడే జనజీవనాన్ని సాధారణ స్థితికి తీసుకురావటానికి వీలవుతుంది. వ్యాక్సిన్​ ద్వారా మిలియన్ల మంది జీవితాలను కాపాడవచ్చు.

డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

అత్యంత సురక్షితంగా వ్యాక్సిన్ క్లినికల్​ ట్రయల్స్​ జరుగుతున్నాయని ట్రంప్​ అన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధే తమ ముందున్న ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. టీకాను ఆమోదించిన 24 గంటల్లోనే ప్రజలకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:మెయిల్​ ఓటింగ్​ ట్వీట్​పై ట్రంప్​కు ట్విటర్ హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.