ETV Bharat / international

అమెరికా వీసాలపై దిగులొద్దు: కేంద్రం​ భరోసా

కరోనా మహమ్మారితో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలతో ఆ దేశం కుదేలైంది. ఈ నేపథ్యంలో ఉపాధి, విద్య, ఇతర అవసరాల కోసం వెళ్లిన భారతీయులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి విపత్కర సమయంలో వారికి ఎలాంటి సాయం అందుతోంది? భారత్​ చేపట్టిన చర్యలేంటి? అనే విషయాలపై అమెరికాలోని భారత రాయబారి తరణ్​జిత్​ సింగ్​తో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి.

Exclusive: Taranjit Singh Sandhu on concerns of Indians stranded in the US amid COVID-19 lockdown
కరోనా ఎఫెక్ట్​: అమెరికాలో ఉన్న భారతీయులకు భరోసా ఉందా?
author img

By

Published : Apr 20, 2020, 1:16 PM IST

అమెరికాలోని భారత రాయబారి తరణ్​జిత్​ సింగ్​తో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా అమెరికా లాక్​డౌన్​ అమలు చేస్తోంది. శనివారం నాటికి ఈ దేశంలో 7లక్షల 64వేలకు పైగా పాజిటివ్​ కేసులు నమోదవగా... 40,500 మందికి పైగా ప్రజలు మృతిచెందారు. అయితే లాక్​డౌన్​ కారణంగా దాదాపు 90 శాతం ప్రజలు ఇళ్లలోనే నిర్బంధంలో ఉంటున్నారు. ఈ వైరస్​ విజృంభణతో ఆర్థికంగానూ చాలా ఇబ్బందులు ఎదురొంటున్నారు. అందుకే వైరస్​ ఉద్ధృతి తక్కువగా ఉన్న కొన్ని చోట్ల లాక్​డౌన్​ నిబంధనలను ఎత్తివేయాలని నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో... అమెరికా ఉంటున్న భారతీయుల సంగతేంటి? ముఖ్యమంగా అక్కడ ఉన్న 2 లక్షల మంది విద్యార్థులు ఎలా ఉన్నారు. వారికి భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందుతోంది? వంటి విషయాలపై ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు అమెరికాలోని భారత రాయబారి తరణ్​జిత్​ సింగ్​.

అమెరికాలో కరోనా పరిస్థితి ఎలా ఉంది? లాక్​డౌన్​ కారణంగా అక్కడ ఉన్న భారతీయుల విషయంలో మీరు తీసుకుంటున్న చర్యలేంటి?

అమెరికాలో ఇప్పటివరకు కరోనా కారణంగా 7.64 లక్షల కేసులు నమోదయ్యాయి. మొత్తం 50 రాష్ట్రాలు ఈ మహమ్మారి బారిన పడ్డాయి. ఒక్క న్యూయర్క్​లోనే 33 శాతం కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే 90 శాతం మంది ప్రజలు లాక్​డౌన్​ కారణంగా ఇళ్లలోనే ఉంటున్నారు.

అగ్రరాజ్యంలో దాదాపు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో లక్షా 25 వేల మందికి హెచ్​1బీ వీసాలు ఉన్నాయి. మరో 6 లక్షల మందికి గ్రీన్​కార్డ్ ఉంది. అంతేకాకుండా పర్యటకులూ ఉన్నారు. వీరందరి కోసం విదేశాంగ కార్యాలయం సహా భారత్​కు చెందిన అన్ని రాయబార​ కార్యాలయాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. దాదాపు అందరితోనూ మేము సంప్రదింపులు జరుపుతున్నాం.

అమెరికాలోని ఆయా ప్రాంతాల్లో నిర్బంధంలో ఉండిపోయిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారా?

విద్యార్థుల విషయంలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నాం. సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్​, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ సహా వెబ్​సైట్​ ద్వారా అందరినీ సమన్వయం చేసుకుంటున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 11న కరోనాను మహమ్మారిగా ప్రకటించిన తర్వాత.. 24/7 అందుబాటులో ఉండేలా ప్రత్యేక హెల్ప్​లైన్లను ప్రారంభించాం. వాషింగ్టన్​లోని దౌత్య కార్యాలయం సహా ఐదు కాన్సులేట్​లలో విద్యార్థుల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలనూ ఏర్పాటు చేశాం. ఇవి ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేయనున్నాయి. ఫోన్​ల ద్వారానే 50 వేల మందితో టచ్​లో ఉన్నాం. ఏప్రిల్​ 11న దాదాపు 25వేల మంది విద్యార్థులతో ఇన్​స్టా లైవ్​ ద్వారా పలు విషయాలు చర్చించాం. వారికి 20 మార్గదర్శకాలను తెలియపరిచాం. ఆయా ప్రాంతాలలో ఉన్న పలు ప్రవాస భారతీయ సంఘాలతో మేము ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ పరిస్థితి సమీక్షిస్తున్నాం.

చాలా మంది భారతీయులు స్వదేశానికి పంపాలని అభ్యర్థిస్తున్నారు. వారికి ఎలాంటి సహకారం అందిస్తున్నారు?

విద్యార్థులకు వైద్య సదుపాయాలు అందిస్తున్నాం. ప్రవాస భారతీయ వైద్యులతోనూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం. ఇటీవలె కొలరాడోలో ఓ వ్యక్తికి వైద్యం అత్యవసరం కాగానే.. ఆ ప్రాంతంలో వైద్యులను సంప్రదించి ఆ విద్యార్థికి, తన కుటుంబానికి అండగా నిలిచాం.

అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలతో మాట్లాడి భారత విద్యార్థులకు ఆశ్రయం ఇచ్చేలా ఏర్పాట్లు చేశాం. మనవాళ్ల కోసం ప్రత్యేక గదులు ఇచ్చేలా చూశాం. భారతీయ సంతతికి చెందిన వారి హోటళ్లలో భారతీయ విద్యార్థులకు ఆశ్రయం ఇవ్వాలని కోరాం. ఆహారం సహా అత్యవసర సహాయసహకారాలు అందిస్తున్నాం.

వీసాలు, హెచ్​1బీ వీసాల విషయంలో కొంత సందిగ్ధం నెలకొంది. అందరూ ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయమేంటి?

ఇప్పటికే వీసాల వ్యవహారంపై దృష్టి సారించాం. హెచ్​1బీ, జే1, ఎఫ్​1 వీసాల విషయంలో మరింత దృష్టి పెట్టాం. అమెరికాలోని అధికారులతో మాట్లాడుతున్నాం. కరోనా పరిస్థితులు చక్కబడగానే కచ్చితంగా పరిష్కారం చూపెడతాం. భయపడాల్సిన అవసరం లేదు. వీసా విషయాల్లో ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే మా దృష్టికి తేవాలని మనవాళ్లకు ఇప్పటికే సూచనలిచ్చాం.

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో భారత్​-అమెరికా కలిసి ఏ విధంగా పనిచేస్తున్నాయి?

కరోనాపై పోరాటంలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. రెండు దేశాలు ప్రభుత్వ​, ప్రైవేటు భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తున్నాయి. భారత్​లోని ఫార్మా, మెడికల్​ సంస్థలు సహాయం అందించేందుకు ముందుకొచ్చాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్​కు అమెరికాలో బాగా డిమాండ్​ ఉంది. ప్రపంచంలో ఆ మందును ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది భారత్​. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం​ కీలక భాగస్వామిగా ఉండటం సంతోషం. భారతదేశ సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే భారత్​లోని పలు సంస్థలకు అమెరికా కూడా టెస్టింగ్​ కిట్లు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు అందించేందుకు ముందుకొచ్చింది.

ఇదీ చదవండి:

హెచ్​1బీ వీసా గడువు పరిమితి పొడిగింపు: అమెరికా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.