ETV Bharat / international

గ్రీన్​ కార్డుకోసం మనోళ్లు దశాబ్దాలు వేచి చూడాల్సిందే!

author img

By

Published : Mar 31, 2020, 11:26 AM IST

అమెరికాలో భారతీయులు గ్రీన్​ కార్డు పొందాలంటే ఇకపై దశాబ్దాలు వేచి చూడక తప్పదని ఆ దేశ చట్టసభ​ ఓ నివేదికలో పేర్కొంది. 2030 నాటికి ఉపాధి ఆధారిత లబ్ధిదారుల సంఖ్య రెట్టింపు కానుండడమే ఇందుకు కారణమని వివరించింది.

Employment-based backlog to double by 2030, Indians will have to wait for decades for Green Card: CRS
గ్రీన్​ కార్డుకోసం ఇకపై మనం దశాబ్దాలు వేచి చూడాల్సిందే!

అమెరికాలో గ్రీన్​ కార్డు కోసం ఎదురు చూసేవారి సంఖ్య 2030 నాటికి రెట్టింపు కానుందని కాంగ్రెస్ ఓ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇకపై అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులు గ్రీన్​గార్డు​ పొందాలంటే.. దశాబ్దాలు వేచి చూడాల్సి వస్తుందని పేర్కొంది.

అమెరికా పౌరులు కానివారు ఆ దేశంలో శాశ్వతంగా నివసించేందుకు, ఉద్యోగాలు చేసుకోవడానికి ఇచ్చే అనుమతినే గ్రీన్​ కార్డు అంటారు. భారత్​కు చెందిన ఐటీ నిపుణులు.. ప్రధానంగా హెచ్​-1 బీ వర్క్​ వీసాలపై అమెరికాకు వస్తారు. ప్రస్తుత ఇమిగ్రేషన్​ వ్యవస్థ ప్రకారం.. గ్రీన్​ కార్డుల్లో ప్రతి దేశానికి 7 శాతం మాత్రమే కేటాయిస్తోంది అగ్రరాజ్యం. అయితే ఈ విధానం రద్దు చేస్తే.. కాల పరిమితి కాస్త తగ్గే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్​ రీసెర్చ్​ సర్వీస్​(సీఆర్​ఎస్​) నివేదికలో తెలిపింది.

కేటాయింపులకు మించి ప్రతిపాదనలు..

ప్రస్తుతం అమెరికాలో 10 లక్షల మంది విదేశీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు చట్టబద్ధమైన శాశ్వత పౌరసత్వం(గ్రీన్​ కార్డు) కోసం అర్హత పొంది, వాటికోసం ఎదురు చూస్తున్నారు. ఏటా అమెరికా సంస్థలు.. గ్రీన్​ కార్డుల కోసం ప్రతిపాదించే విదేశీ ఉద్యోగుల సంఖ్య.. వార్షిక చట్టబద్ధమైన గ్రీన్​ కార్డు కేటాయింపును మించిపోయింది. అయితే ఇకపై వీటికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.

ఇంకొన్ని రోజులు పొడిగించండి..

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభంతో తమ ఉద్యోగాలు కోల్పోతామని హెచ్-1బీ వీసాపై వచ్చిన విదేశీ సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగం లేకుండా అమెరికాలో నివసించేందుకు 60 రోజులుగా ఉన్న కాలపరిమితిని.. 180 రోజులకు పెంచాలని హెచ్​-1 బీ ఉద్యోగులు ట్రంప్​ను కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.