లోక్సభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా నేతలు శుభాకాంక్షలు తెలిపారు. భారత ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
నిబద్ధతకు నిదర్శనం
అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రధాని మోదీకి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యం పట్ల భారత ప్రజలకు ఉన్న నిబద్ధతకు ఈ ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. ఇరుదేశాల బంధం బలోపేతానికి భారత్తో కలిసి కొనసాగుతామన్నారు.
-
Congrats to an American ally & friend PM @narendramodi, on his party’s win in India’s parliamentary election. This was a strong display of the Indian people’s commitment to democracy! We look forward to continuing to work with India for a freer, safer, & more prosperous region.
— Vice President Mike Pence (@VP) May 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congrats to an American ally & friend PM @narendramodi, on his party’s win in India’s parliamentary election. This was a strong display of the Indian people’s commitment to democracy! We look forward to continuing to work with India for a freer, safer, & more prosperous region.
— Vice President Mike Pence (@VP) May 23, 2019Congrats to an American ally & friend PM @narendramodi, on his party’s win in India’s parliamentary election. This was a strong display of the Indian people’s commitment to democracy! We look forward to continuing to work with India for a freer, safer, & more prosperous region.
— Vice President Mike Pence (@VP) May 23, 2019
ప్రపంచానికే స్ఫూర్తి
ఎన్నికల్లో విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్డీఏకి అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో శుభాకాంక్షలు తెలిపారు. అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నందుకు భారత ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్యంలోని ఎన్నికల ప్రక్రియ ప్రపంచానికే స్ఫూర్తి అంటూ అని కొనియాడారు.
-
Congratulations to @narendramodi and the NDA for their victory in India’s election, and to the Indian people for casting their votes in such historic numbers. As the world’s largest exercise in democracy, #India’s election is an inspiration around the world. pic.twitter.com/S7qAuX8lcq
— Secretary Pompeo (@SecPompeo) May 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations to @narendramodi and the NDA for their victory in India’s election, and to the Indian people for casting their votes in such historic numbers. As the world’s largest exercise in democracy, #India’s election is an inspiration around the world. pic.twitter.com/S7qAuX8lcq
— Secretary Pompeo (@SecPompeo) May 23, 2019Congratulations to @narendramodi and the NDA for their victory in India’s election, and to the Indian people for casting their votes in such historic numbers. As the world’s largest exercise in democracy, #India’s election is an inspiration around the world. pic.twitter.com/S7qAuX8lcq
— Secretary Pompeo (@SecPompeo) May 23, 2019
'పోలింగ్ శాతం' అభినందనీయం
భారత్లో భారీస్థాయిలో పోలింగ్ శాతం నమోదవడంపై ప్రశంసలు కురిపించారు అమెరికా విదేశాంగ ప్రతినిధి మోర్గాన్ ఓర్టాగస్. సుమారు 60కోట్ల మంది ప్రజలు ఎన్నికల్లో భాగస్వామ్యులు అయ్యారని, భారత ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను అద్భుతంగా నిర్వహించిందని కొనియాడారు. భారత్-అమెరికా ఉగ్రవాద నిర్మూలనతో పాటు పలు అంశాల్లో కీలక భాగస్వాములని గుర్తుచేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ధీమా వ్యక్తంచేశారు.
పలువురు అమెరికా చట్టసభ్యులు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. హౌస్ మెజార్టీ నాయకుడు స్టెనీ హోయెర్, కాంగ్రెస్ సభ్యుడు జార్జ్ హోల్డింగ్, సెనేటర్ కెవిన్ థామస్, జాన్ కార్నిన్ మోదీని అభినందించారు.
ఇదీ చూడండి: మోదీకి దేశాధినేతల శుభాకాంక్షల వెల్లువ