Earthquake in US: అమెరికా ఉత్తర కాలిఫోర్నియా తీరంలో సోమవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదైంది. భూకంపం కారణంగా పెట్రోలియా పట్టణంలో భూమి తీవ్రంగా కంపించింది. షెల్వ్స్లోని వస్తువులు కిందపడ్డాయి. భయంతో జనం ఇళ్లు, కార్యాలయాలను వీడి బయటకు పరుగులు తీశారు.
Northern California earthquake: భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని జాతీయ వాతావరణ సర్వీసు తెలిపింది. శాన్ ఫ్రాన్సిస్కోకు వాయవ్యంగా 210 మైళ్ల దూరంలో ఉన్న పెట్రోలియా పట్టణానికి కొద్ది దూరంలో ఈ భూకంపం కేంద్రం ఉన్నట్లు చెప్పింది.
భూప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో భవనాలు కంపించాయని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం కారణంగా 10 మిలియన్ డాలర్ల కంటే తక్కువ ఆస్తి నష్టమే జరిగి ఉంటుందని అంచనా వేసింది.
భూకంపం సంభవించిన కొన్నిగంటల తర్వాత ఓ డెయిరీ భవనం కుప్పకూలిందని లోలెటా పట్టణ ప్రజలు తెలిపారు. కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలోని ఓ కిరాణా స్టోర్‌లో కిటకీలు ధ్వంసమయ్యాయి. మరో దుకాణంలోని షెల్వ్స్ నుంచి సీసాలు కిందపడి పగిలిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 20 సెకన్లపాటు భూమి కంపించిందని పెట్రోలియాకు చెందిన జనరల్ స్టోర్ మేనేజర్ జానే డెక్సెటార్ తెలిపారు.
ఇదీ చూడండి: మరో ఆలయంపై దాడి.. పాక్‌లో ఏం జరుగుతోంది?
ఇదీ చూడండి: వైట్‌హౌస్ ఉద్యోగికి కరోనా.. 3 రోజుల క్రితమే బైడెన్‌తో కలిసి...