అమెరికా బాల్టిమోర్‌లోని మేరీల్యాండ్ వైద్య విశ్వవిద్యాలయం అరుదైన ఘనత సాధించింది. అవయవ మార్పిడి కోసం మొదటిసారిగా డ్రోన్‌ను ఉపయోగించారు. అనంతరం విజయవంతంగా శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు.
బాల్టిమోర్‌లోని ట్రినా గ్లిస్పీ ఎనిమిదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. డయాలసిస్ సాయంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. పరిస్థితి విషమించటం వల్ల కిడ్నీ మార్పిడి అత్యవసరమయింది. ఫలితంగా దాత నుంచి సేకరించిన కిడ్నీని సుమారు పది నిమిషాల్లో తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకు డ్రోన్ ఉపయోగించి విజయవంతమయ్యారు వైద్యులు.
"ఛార్టర్ విమానాలు ఉపయోగిస్తే ఖర్చు అధికంగా అవుతుంది. మనకు చాలా సాంకేతికత అందుబాటులో ఉంది. అది ఇందుకు ఉపయోగించాలని చూశాం. ఉన్నవాటిని అనుగుణంగా వాడుకుని సౌకర్యవంతంగా అవయవ మార్పిడి చేయగలిగాం."
- స్కేలియా, వైద్యులు
ఇదీ చూడండి: వరదలు, టోర్నడోలతో అమెరికా గజగజ