ETV Bharat / international

వైరల్ వీడియో : బాహుబలిగా ఒదిగిపోయిన 'ట్రంప్​'

author img

By

Published : Feb 23, 2020, 9:37 AM IST

Updated : Mar 2, 2020, 6:45 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ రీట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలను ఊపేస్తోంది. భారత సూపర్​హిట్ సినిమా బాహుబలి కథానాయకుడి దేహంపై తన ముఖం మార్ఫ్​ చేసి ఉన్న ఓ వీడియోను రీట్వీట్​ చేశారు. ట్రంప్​ను బాహుబలిగా, సామ్రాజ్య రక్షకుడిగా చూపిస్తోంది ఆ వీడియో. దీనిని చూసి ముచ్చట పడిన ట్రంప్... భారత మిత్రులతో గడపడానికి ఎదురుచూస్తున్నా అని రాసుకొచ్చారు.

donald trump as bahubali
బాహుబలి ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ఏం చేసిన ఓ సంచలనమే. తన ట్వీట్లతో కూడా నిత్యం వార్తల్లో ఉంటారు ట్రంప్​. తనపై వచ్చే విమర్శలను ఎంతో ట్రెండీగా తిప్పికొడతారు కూడా. ఇటీవలే తన ఆరోగ్యంపై వచ్చిన విమర్శలకు చెక్​ పెట్టడానికి ఓ హాలీవుడ్​ కండలవీరుడి దేహానికి తన ముఖం మార్ఫ్​ చేసి ఉన్న ఫొటోను ట్వీట్​ చేశారు. తాజాగా భారత్​ పర్యటనకు సిద్ధమవుతున్న ట్రంప్​.. ఓ రీట్వీట్​తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈసారి ట్రంప్​ ఖాతాలో ఉన్నది.. భారత్​తో పాటు యావత్​ ప్రపంచాన్ని ఆకట్టుకున్న 'బాహుబలి'.

వీరాధివీరునిగా..

బాహుబలి చిత్రంలో కథానాయకుడు చేసిన విన్యాసాలను చూపిస్తూ 'సోల్​మీమ్స్​1' అనే ట్విట్టర్​ పేజీ రూపొందించిన ఓ వీడియోను ట్రంప్​ రీట్వీట్​ చేశారు. రీట్వీట్​తో పాటు 'భారత్​లోని గొప్ప మిత్రులతో గడపడానికి ఎదురుచూస్తున్నా' అని రాసుకొచ్చారు ట్రంప్​.

ఈ వీడియోలో అమెరికా ప్రథమ మహిళ మెలానియాతో రథంపై స్వారీ చేస్తున్న ట్రంప్.. ఓ యోధుడిగా కనిపిస్తారు. తరువాత తన కుమారుడు డొనాల్డ్ జూనియర్​, కుమార్తె ఇవాంకాను తన భూజాలపై మోసుకుంటూ వెళ్తారు. గుర్రపు స్వారీ చేస్తూ వీరాధివీరునిగా దర్శనమిస్తారు.

మోదీ స్వాగతం

ఇదే క్లిప్​లో భారత ప్రధాని నరేంద్రమోదీ ఓ గ్రామంలో వేలాది మంది ప్రజలతో ఎదురువచ్చి ట్రంప్​కు స్వాగతం పలుకుతారు. చివరికి 'యూఎస్​ఏ, ఇండియా యునైటెడ్' అనే సందేశంతో వీడియో ముగుస్తుంది. ట్రంప్​ రీట్వీట్ చేసిన వెంటనే ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. కొద్ది గంటల్లోనే దాదాపు 6లక్షలమంది ఈ వీడియోను వీక్షించారు.

తొలి పర్యటన

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో భారత పర్యటనకు రానున్నారు. ట్రంప్​తో పాటు ఆయన భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్ కుష్నర్​ వస్తారు.

ఇదీ చూడండి: భారత్​లో పర్యటించిన అగ్రరాజ్యం ప్రథమ మహిళలు వీరే

Last Updated : Mar 2, 2020, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.