ETV Bharat / international

వారిపై కొవిడ్​ టీకా పెద్దగా ప్రభావం చూపదు!

author img

By

Published : Jan 14, 2021, 8:28 PM IST

కుంగుబాటు, ఆందోళనతో మీరు బాధపడుతున్నారా? అయితే జాగ్రత్త! కొవిడ్​ టీకా మీపై సమర్థవంతంగా పని చేయకపోవచ్చు. ఈ విషయాన్ని అమెరికా పరిశోధకులే చెబుతున్నారు. దీనికి కారణమేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..

Depression, stress may reduce efficacy of COVID-19 vaccines, scientists say
అలాంటి వారిపై కొవిడ్​ టీకా పెద్దగా ప్రభావం చూపదు!

టీకా సమర్థతపై అమెరికాలోని ఓహాయో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కీలక విషయాల్ని వెల్లడించారు. ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు, ఒంటరితనం వంటి సమస్యలు.. రోగనిరోధక వ్యవస్థను బలహీనం చేస్తాయని పేర్కొన్నారు. తద్వారా.. వారిపై కొవిడ్​ వంటి వ్యాక్సిన్ల సమర్థత దెబ్బతింటాయని స్పష్టం చేశారు.

టీకా తీసుకోవడానికి 24 గంటల ముందు వ్యాయామం, సరైన నిద్ర ఉన్నట్లైతే.. టీకా ప్రభావం అధికంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. పర్స్పెక్టివ్స్​ ఆఫ్​ సైకలాజికల్​ సైన్స్ జర్నల్​లో వీరి అధ్యయనం ప్రచురితమైంది.

శారీరకంగానే కాదు.. మానసికంగానూ కరోనా మహమ్మారి ప్రభావాన్ని చూపుతుంది. దానివల్ల ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా వ్యాక్సిన్​ సమర్థతపై ప్రభావం పడుతుంది.

-- అన్నెలిస్​ మాడిసన్​, ఓహాయో విశ్వవిద్యాలయ పరిశోధకుడు.

అమెరికాలో పంపిణీ చేస్తున్న కరోనా టీకాలు.. పరీక్షల్లో సత్ఫలితాలు నమోదు చేసినప్పటికీ.. వ్యాక్సిన్​ తీసుకున్న వెంటనే ప్రతి ఒక్కరిలోనూ రోగ నిరోధక శక్తి పెరగలేదనే విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ప్రస్తుతం వినియోగిస్తున్న కొవిడ్​ టీకాలన్నీ 95శాతం సమర్థవంతమైనవేనని పరిశోధకులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:వుహాన్​ చేరుకున్న డబ్ల్యూహెచ్​ఓ బృందం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.