ETV Bharat / international

'చికెన్​పాక్స్​ తరహాలో 'డెల్టా' విజృంభణ'

author img

By

Published : Jul 30, 2021, 2:27 PM IST

కరోనా ఇతర ఉత్పరివర్తనాల కన్నా డెల్డా వేరియంట్.. తీవ్ర వ్యాధి ప్రభావాన్ని కలగజేస్తుందని అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం(సీడీసీ) అధ్యయనంలో వెల్లడైంది. మెర్స్​, సార్స్​, ఎబోలా వంటి వైరస్​ల కన్నా అధిక వేగంతో కరోనా ఈ వేరియంట్​ వ్యాప్తి చెందుతుందని తేలింది.

delta variant
డెల్టా వేరియంట్​

కరోనా డెల్టా వేరియంట్​పై అమెరికా ఆరోగ్య విభాగం విస్తుగొలిపే విషయాలు వెల్లడించింది. ఈ వేరియంట్​ అంతకుముందు ఉన్న ఉత్పరివర్తనాల కన్నా.. తీవ్రమైన వ్యాధి ప్రభావానికి కారణమవ్వగలదని తెలిపింది. చికెన్​పాక్స్ తరహాలో సులభంగా ఇతరులకు వ్యాపించగలదని చెప్పింది. ఈ మేరకు అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం(సీడీసీ) రూపొందించిన పత్రాల్లోని సమాచారాన్ని అక్కడి మీడియా సంస్థలు తమ కథనాల్లో ప్రచురించాయి.

వ్యాక్సిన్​ తీసుకున్నా..

వ్యాక్సిన్ తీసుకోనివారికి, రెండు డోసుల టీకా తీసుకున్నవారికి కూడా డెల్టా వేరియంట్ సోకే అవకాశాలు సమానస్థాయిలో ఉన్నాయని సీడీసీ తన పత్రాల్లో పేర్కొంది. ఈ పత్రాలను అమెరికాకు చెందిన వాషింగ్టన్​ పోస్ట్​ తొలుత ప్రచురించింది. అంతకుముందు కరోనా టీకా తీసుకున్నప్పటికీ... బ్రేక్ త్రూ ఇన్​ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని సీడీసీ డైరెక్టర్​ రాచెల్లె పీ వాలెన్స్కీ మంగళవారం తెలిపారు. అయితే.. ఇప్పుడు సీడీసీ పత్రాల ద్వారా డెల్టా వేరియంట్​ వ్యాప్తిపై మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

అన్నింటికంటే అధికంగా...

మెర్స్​, సార్స్, ఎబోలా, జలుబు, సీజనల్​ జ్వరం, మశూచి, తట్టు వంటి వ్యాధులు కలగజేసే వైరస్​ల కంటే... డెల్టా వేరియంట్​ అత్యధికంగా వ్యాప్తి చెందుతుందని ఈ పత్రాల ద్వారా వెల్లడైంది. వైరస్​పై పోరు మారిందని ప్రకటించడమే తామిక చేయాల్సిన పని అని ఈ పత్రాల్లో సీడీసీ పేర్కొంది. అయితే.. డెల్టా వేరియంట్​పై మరింత సమాచారాన్ని శుక్రవారమే సీడీసీ ప్రచురించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: ఒలింపిక్స్​ వేళ కరోనా​ బీభత్సం- జపాన్​ కీలక నిర్ణయం

ఇదీ చూడండి: ప్రమాదకర వేరియంట్లూ తల వంచాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.