ETV Bharat / international

అమెరికాలో కరోనా 'డెల్టా' విజృంభణ- చిన్నారుల్లోనూ... - అమెరికాలో డెల్టా వేరియంట్

అమెరికాను కరోనా డెల్టా వేరియంట్‌ కలవరపెడుతోంది. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో దాదాపు 51శాతం డెల్టా వేరియంట్‌ వ్యాధిగ్రస్థులే ఉన్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన సంస్థ(సీడీసీపీ) తెలిపింది.

Delta dominant variant in US
అమెరికా
author img

By

Published : Jul 7, 2021, 4:42 PM IST

భారత్‌లో రెండో దశలో అమాంతం విరుచుకుపడిన కరోనా డెల్టా వేరియంట్‌ అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇతర వేరియంట్లతో పోల్చితే డెల్టా వైరస్ ప్రధాన రకంగా మారిందని అమెరికా శాస్త్రవేత్తలు నిర్ధరించారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ చిన్నారులపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్న కొత్త కేసుల్లో 80శాతం కంటే అధికంగా డెల్టా రకం కేసులు వెలుగు చూస్తున్నట్లు తెలిపింది. మిస్సౌరీ, కేన్సస్, అయోవా రాష్ట్రాల్లో 80శాతం కేసులు డెల్టా వేరియంటే కావడం ఆందోళన కలిగిస్తోంది.

74.3శాతం ఆ కేసులే..

ఉటా, కొలరాడో రాష్ట్రాల్లో పాజిటివ్‌గా తెలిన బాధితుల్లో 74.3శాతం మందికి డెల్టా రకం సోకినట్లు సీడీసీపీ తెలిపింది. టెక్సాస్, లూసియానా, అర్కాన్సాస్, ఓక్లహోమాలో కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో 58.8 శాతం ఈ రకం కేసులే ఉన్నట్లు వెల్లడించింది.

రానున్న రోజుల్లో వేగంగా..

టీకా వేయించుకోని వారిపై డెల్టా వేరియంట్‌ ప్రభావం అధికంగా ఉన్నట్లు అమెరికా వైద్య నిపుణులు అన్నామోరీ డేవిడ్సన్ తెలిపారు. కరోనా డెల్టాకు సంక్రమణ శక్తి అధికమని.. దీనిని తీవ్రమైన వ్యాధిగా పరిగణించాలని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించారు.

చిన్నారులు జాగ్రత్త..

గాల్వెస్టన్‌ కౌంటీ జిల్లా ఆరోగ్య శాఖ అధ్యయన ప్రకారం ఆ జిల్లాలో నమోదైన 450 కేసుల్లో 6 నుంచి 12 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారుల్లో 57 మంది డెల్టా బారిన పడ్డారు. ప్రస్తుత అధ్యయనాలను దృష్టిలో పెట్టుకుని చిన్నారులతో బహిరంగ ప్రదేశాలు, ప్రార్థన మందిరాలకు వెళ్లే మహిళలు, ఇతరులు జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

సీడీసీ నివేదిక ప్రకారం.. అమెరికాలో 12నుంచి 15 ఏళ్ల మధ్య వయస్కుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు రెండు డోసులు, 16 నుంచి 17 ఏళ్ల మధ్య ప్రతి ముగ్గురిలో ఒకరు కరోనా టీకాలు వేసుకున్నారు.

వారే ఎక్కువ..

చిన్నారులు, యువకులు ఎక్కువగా డెల్టా బారిన పడుతుండటంపై ఆరోగ్య సిబ్బంది ఆందోళన చెందుతున్నట్లు డేవిడ్ పార్సీ తెలిపారు. డెల్టా సోకితే చాలా వరకు ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని.. తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.

అమెరికాలో చిన్నారులపై డెల్టా వేరియంట్ ప్రమాదం అధికంగా ఉన్న నేపథ్యంలో 2 ఏళ్లు దాటిన చిన్నారులకు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలని తల్లితండ్రులకు సూచించారు. డెల్టా సంక్రమించకుండా ఉండేందుకు ఒకరికొకరు 20 అడుగుల వరకు భౌతిక దూరం పాటించాలని చెప్పారు. కరోనా స్పైక్‌ ప్రోటిన్‌లో ఉత్పరివర్తనం వల్లే డెల్టా అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లు పేర్కొన్నారు.

అమెరికాలో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ పూర్తి స్థాయిలో జరగకపోతే డెల్టా వ్యాప్తి ఊహకు కూడా అందదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి : 'వారాంతానికి 16 కోట్ల మందికి వ్యాక్సినేషన్​ పూర్తి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.