ETV Bharat / international

'మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుచేటు'

జార్జ్​ ఫ్లాయిడ్​ మృతికి నిరసనగా జరిగిన ఆందోళనల్లో భాగంగా వాషింగ్టన్​లోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని దుండగులు అపవిత్రం చేశారు. తాజాగా దీనిపై స్పందించిన అధ్యక్షుడు ట్రంప్​.. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుచేటు అని తెలిపారు.

Defacement of Mahatma Gandhi's statue was a 'disgrace': Trump
మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుచేటు
author img

By

Published : Jun 9, 2020, 11:46 AM IST

అమెరికా రాజధాని వాషింగ్టన్​లోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం సిగ్గుచేటు అని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వెల్లడించారు. శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్​.

ఇదీ జరిగింది...

అఫ్రో- అమెరికన్​ జార్జ్​ ఫ్లాయిడ్​ ఓ పోలీసు అధికారి కర్కశత్వానికి మరణించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. ఈ నెల 2,3వ తేదీల్లో.. వాషింగ్టన్​లోని భారత రాయబార కార్యాలయం ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని పలువురు ధ్వంసం చేశారు. స్ప్రేలు, గ్రాఫిటీలతో విగ్రహంపై పెయింటింగ్స్​ వేశారు.

ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై అతి త్వరగా దర్యాప్తు జరపాలని యూఎస్​ డిపార్ట్​మెంట్​ ఆఫ్​ స్టేట్​ను కోరింది.

విగ్రహాన్ని పునరుద్ధరించేందుకు యూఎస్​ డిపార్ట్​మెంట్​ ఆఫ్​ స్టేట్​తో పాటు మెట్రోపాలిటిన్​ పోలీస్​, నేషనల్​ పార్క్​ సర్వీస్​తో కలిసి పని చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.