ETV Bharat / international

'డీప్​ ఫ్రైడ్​ వాటర్'..​ ఈ వింతను చూశారా? - డీప్​ ఫ్రై వాటర్​

నీటిని నూనెలో వేయించడం మీరు ఎప్పుడైనా చూశారా? అదేంటి నీరు, నూనె అసలు కలవనే కలవవు.. అలాంటిది నీటిని వేయించడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ప్రస్తుతం ఇదే ట్రెండ్​ నడుస్తోంది. ఆ వంటకం పేరు డీప్​ ఫ్రైడ్​ వాటర్​. అసలు దాని కథేంటో తెలుసుకుందామా..!

deep fried water, డీప్​ ఫ్రై వాటర్​ ట్రెండ్​
డీప్​ ఫ్రై వాటర్
author img

By

Published : Apr 11, 2021, 12:48 PM IST

రోజుకో కొత్త రుచిని తెలుసుకోవాలని మన నాలుక పరితపిస్తుంది. అందుకోసం మనకు వీలు చిక్కినప్పుడల్లా హోటళ్లకు, ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లకు పరుగులు తీస్తాం. కొత్తరకం వంటలు ఏమైనా ఉన్నాయా? అని తెగ వెతికేస్తాం. భోజన ప్రియుల్లో ఇది కొంత ఎక్కువే ఉంటుంది. కరోనా పుణ్యమా అని గతేడాది అందరూ ఇళ్లకు పరిమితమయ్యాక.. చాలా మంది గరిటపట్టారు. ఆన్​లైన్​లో చూసేసి.. వివిధ రకాల వంటలు వండేశారు. అంతేకాకుండా తమ పాకశాస్త్ర నైపుణ్యం గురించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అయితే అన్నింటిలోకి చాలా భిన్నమైన వంటకం ఒకటి అందరిని ఆకర్షించింది. అదే "డీప్​ ఫ్రైడ్​ వాటర్​". నీటిని ఫ్రై చేయడం ఏంటి వింతగా అని ఆశ్చర్యపోతున్నారా? కానీ నమ్మి తీరాల్సిందే మరి. చాలా మంది ప్రస్తుతం ఈ వంటకాన్ని ఓ ట్రెండ్​లా ఫాలో అవుతున్నారు.

అసులు ఏంటీ ఈ డీప్​ ఫ్రైడ్​ వాటర్​?

యూట్యూబర్​ జోనాతన్​ మార్కస్​.. ఈ డీప్​ ఫ్రైడ్​ వాటర్​ సృష్టికర్త. ఏదైనా వంటకాన్ని భిన్నరీతిలో చేసి అందరినీ ఆకట్టుకోవాలని జోనాతన్​​ చేసిన ప్రయత్నమే ఇది. సాధారణంగా.. వంటకాల్లో మార్పులు చేయడం, మెరుగులు దిద్దడం వంటివి చేస్తారు. కానీ ఇతను మాత్రం ఏకంగా కొత్త వంటకాన్నే కనిపెట్టాడు. ఇతను తయారు చేసిన వంటకానికి ప్రస్తుతం ఆదరణ లభిస్తోంది. శాన్​ఫ్రాన్సిస్​కోలో జరిగిన ఓ వంటల పోటీల్లో అతను ఈ డీప్​ ఫ్రైడ్​ వాటర్​ను రూపొందించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నీటిని వేయిస్తారు ఇలా..

వంటకాల్లో వినియోగించే జిలాటిన్​ను పోలి ఉన్న కాల్షియన్ అలిగనైట్​ అనే పదార్థాన్ని నీటిలో కలుపుతారు. దాని వల్ల నీరు సెమీ సాలిడ్​ స్టేట్​కు వస్తుంది. దానిని గుడ్డు పచ్చ సొన, పిండి, బ్రెడ్​ పొడి కిలిసిన మిశ్రమంలో కలుపుతారు. ఆ తర్వాత దానిని నూనెలో బాగా వేయిస్తారు.

deep fried water, డీప్​ ఫ్రై వాటర్​ ట్రెండ్​
డీప్​ ఫ్రైడ్​ వాటర్

రుచిగా ఉంటుందా?

ఈ వంటకం ట్రెండింగ్​లో ఉండటం వల్ల దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే దీని రుచి కాస్త ఉప్పగా ఉంటుందని మార్కస్​ అంటున్నాడు. పదార్థం కూడా జిగురుగా ఉంటుందని చెబుతున్నాడు.

సురక్షితమా..!

ఈ వంటకం ఆరోగ్యానికి హాని తలపెట్టే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. నీటిని వివిధ రకాల పదార్థాల మిశ్రమంతో కలిసి వేడి నూనెలో వేయించడమే అందుకు కారణమని పేర్కొంటున్నారు.

2016లో జోనాతన్​ చేసిన ప్రయత్నానికి సంబంధించిన ఈ వీడియోని ఇప్పుడు తవ్వి తీసి మరీ ట్రెండ్​ చేస్తున్నారు నెటిజన్లు.

ఇదీ చదవండి : గదిలో విగతజీవులుగా తల్లిదండ్రులు.. బాల్కనీలో చిన్నారి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.