ETV Bharat / international

'హెచ్​4 వీసాలపై నిర్ణయం.. బైడెన్​ నిబద్ధతకు నిదర్శనం'

author img

By

Published : Jan 29, 2021, 10:03 AM IST

హెచ్4 వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ తీసుకున్న నిర్ణయం.. వలస మహిళా కార్మికులకు మద్దతుగా ఉండడంలో ఆయన​ నిబద్ధతను సూచిస్తోందని ​సౌత్​ ఆసియాన్​​ అమెరికన్​ లీడింగ్​ టుగెదర్​(సాల్ట్​) సంస్థ పేర్కొంది. త్వరలోనే నూతన పౌరసత్వం చట్టాన్ని కూడా బైడెన్​ ప్రభుత్వం తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

h4 visa biden decission
'హెచ్​4 నిర్ణయం.. వారి పట్ల బైడెన్ నిబద్ధతకు సాక్ష్యం'

హెచ్​1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో పనిచేసుకునేందుకు వీలు కల్పిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ తీసుకున్న నిర్ణయంపై సౌత్ ఆసియాన్​​​ అమెరికన్స్​ లీడింగ్​ టుగెదర్​(సాల్ట్​)​ హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం.. వలస మహిళలను పనిలో ప్రోత్సహించడానికి బైడెన్​-హారిస్​ యంత్రాంగం కట్టుబడి ఉన్నట్లు సూచిస్తోందని తెలిపింది.

"లక్షమంది హెచ్​4 వీసాదారులకు ఈ నిర్ణయం ద్వారా ఊరట లభిస్తుంది. ఈ వీసాదారుల్లో అధిక శాతం మహిళలే ఉన్నారు. కొవిడ్​ మహమ్మారిపై పోరాట సమయంలో వారు కీలక పాత్ర పోషించారు. ఈ తాజా నిర్ణయం.. వలస మహిళలను పనిలో ప్రోత్సహించేందుకు బైడెన్​-హారిస్​ ప్రభుత్వం కట్టుబడి ఉందని సూచిస్తోంది."

- సౌత్​ ఆసియాన్​ అమెరికన్స్​ లీడింగ్​ టుగెదర్​(సాల్ట్​)

వీసాల జారీలో జాప్యం సమస్య కూడా త్వరలోనే సమసిపోతుందని సాల్ట్​ విశ్వాసం వ్యక్తం చేసింది. రానున్న వారాల్లో పౌరసత్వ చట్టం-2021ను బైడెన్​ ప్రభుత్వం తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. బైడెన్​ తాజా నిర్ణయాన్ని ఎఫ్​డబ్ల్యూ.యూఎస్ అనే వలస విధాన సంఘం​ కూడా ప్రశంసించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించడంలో వలస మహిళల పాత్ర ఎంతో కీలకం అని కొనియాడింది.

హెచ్​4 వీసాలంటే ఏంటి?

హెచ్-‌1బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు(జీవిత భాగస్వామి సహా.. 21 ఏళ్లలోపు పిల్లలు) అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ(యూఎస్​ సిటిజన్​షిప్​ అండ్​ ఇమ్మిగ్రేషన్​ సర్వీసెస్​-యూఎస్‌సీఐఎస్‌) హెచ్‌4 వీసాలు జారీ చేస్తుంది. హెచ్‌4 వీసాదారులు చట్టపరంగా అమెరికాలో ఉద్యోగం చేసుకునేలా పని అనుమతి కల్పిస్తూ 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి రాగానే.. వలస విధానంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. హెచ్‌4 వీసాదారులకు పని అనుమతులు రద్దు చేయనున్నట్లు యూఎస్‌ కోర్టుకు తెలిపారు. కానీ ఈ ప్రక్రియను తన పాలనా గడువులో పూర్తి చేయలేకపోయారు ట్రంప్​. ఫలితంగా.. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం.. ట్రంప్​ విధానాన్ని బైడెన్ రద్దు చేశారు.

ఇదీ చదవండి:'ఒబామా కేర్'​ మళ్లీ ప్రారంభం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.