బ్రెజిల్ ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అవుతోంది. కొవిడ్-19 కేసుల్లో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ దేశాన్ని మరో ప్రకృతి విపత్తు తాకింది. భారీ తుపాను కారణంగా దక్షిణ బ్రెజిల్లో వరదలు సంభవించాయి. శాంటా కాటారినా రాష్ట్రంలో ఇప్పటివరకు 9 మంది మృతి చెందగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.
మరో రాష్ట్రం రియో గ్రాండే డూ సోల్లో 1100మంది నిరాశ్రయులయ్యారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి వేలాది మంది అంధకారంలోకి వెళ్లారు.
ఇదీ చూడండి: కరోనా పంజా: ఆఫ్రికాలో 4 లక్షల కేసులు, 10 వేల మరణాలు