ETV Bharat / international

పాపం మొసలి.. పక్షి అనుకుని డ్రోన్​ను మింగేసింది! - డ్రోన్​ను తినబోయిన మొసలి

సాధారణంగా మొసలికి ఆకలి వేస్తే.. తన పరిసర ప్రాంతాల్లోని ఇతర జీవులను వేటాడి తింటుంది. అయితే అమెరికాలో ఓ మొసలి.. గాలిలో ఎగురుతున్న డ్రోన్​ను తినబోయింది. చివరకి ఏమైందంటే?

crocodile snatches drone
డ్రోన్​ తినబోయిన మొసలి అవస్థలు
author img

By

Published : Sep 2, 2021, 12:23 PM IST

మొసళ్లు ఇతర జీవులను వేటాడి తింటాయి. అవి ఆకలితో ఉన్న సమయంలో ఏ జీవి దొరికినా అమాంతం మింగేస్తాయి. అయితే అమెరికా ఫ్లోరిడాలోని ఓ మొసలి డ్రోన్​ను తినాలని ప్రయత్నించింది. దానికి అతిసమీపంలో ఎగురుతున్న డ్రోన్​ను.. ఏదో పక్షి అనుకొని లటుక్కున పట్టుకొని.. గుటుక్కున మింగబోయింది. ఇంతలోనే ఆ డ్రోన్​ పేలి దాని నోటి నుంచి విపరీతంగా పొగలు వచ్చాయి. దీంతో కక్కలేక, మింగలేక తీవ్ర అవస్థలు పడిందా మొసలి. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్​ అయింది.

crocodile snatches drone
డ్రోన్​ను తినబోయిన మొసలి అవస్థలు

సుందార్ పిచాయ్​ ట్వీట్

తమ సంస్థకు చెందిన కొత్త అప్​డేట్స్​, పండగల సమయాల్లో తన ఫాలోవర్స్​, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపే గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​.. ఈ ఆసక్తికరమైన వీడియోను రీట్వీట్​ చేయడం విశేషం. దీనిని బ్రిటీష్​ వ్యాపారి క్రిస్ అండర్సన్​ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు.

ఇదీ చూడండి: న్యూస్​ ఛానల్​లో శునకం సందడి- లైవ్​ బులెటిన్ మధ్యలో వచ్చి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.