అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలోని అడవుల్లో మంటలు చెలరేగాయి. వెంచురా కౌంటీ ప్రాంతంలో కార్చిచ్చు వ్యాప్తి చెందుతోంది. హెలికాప్టర్ ద్వారా 93 కిలోమీటర్ల దూరంలో లాస్ ఏంజెల్స్‌లో ఉన్న కాసిటాస్ నది నుంచి నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.
అటవీ పరిసర ప్రాంతాల్లో రెడ్ ఫ్లాగ్ హెచ్చరికలు జారీ చేశారు. అధిక ఉష్ణోగ్రత కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఉటా రాష్ట్రంలోనూ..
ఉటా రాష్ట్రంలోనూ కార్చిచ్చు చెలరేగింది. దాదాపు 300 మంది అగ్నిమాపక సిబ్బందితో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 90 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేశారు.
ఇదీ చదవండి : viral: అడవిలో హాయిగా సేద తీరుతున్న ఏనుగులు