ETV Bharat / international

భూమిపై అడుగుపెట్టనున్న 'స్పేస్​ ఎక్స్​' వ్యోమగాములు - గల్ఫ్​ ఆఫ్​ మెక్సికో

అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన మొదటి వ్యాపారసంస్థగా రికార్డులకెక్కిన 'స్పేస్​ ఎక్స్​' క్రూ డ్రాగన్​ వ్యోమనౌక నేడు భూమిపై అడుగుపెట్టనుంది. అంతరిక్షం నుంచి వ్యోమగాములను భూమిపైకి తీసుకువస్తున్న తొలి ప్రైవేటు సంస్థగా చరిత్ర సృష్టించనుంది స్పేస్​ ఎక్స్​. మే 30న ఈ రాకెట్​ ప్రయోగం జరిగింది.

Crew Dragon undocks from ISS, headed back to Earth
భూమిపై అడుగుపెట్టనున్న 'స్పేస్​ ఎక్స్​' వ్యోమగాములు
author img

By

Published : Aug 2, 2020, 7:01 AM IST

తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్ధ స్పేస్‌-ఎక్స్‌ ద్వారా మే 30న అంతరిక్షంలోకి బయలుదేరిన ఇద్దరు వ్యోమగాములు నేడు భూమిపై తిరిగి అడుగుపెట్టనున్నారు. అంతరిక్షం నుంచి వ్యోమగాములను భూమి నుంచి తీసుకువస్తున్న తొలి ప్రైవేటు సంస్ధగా కూడా స్పేస్‌-ఎక్స్‌ చరిత్ర సృష్టించనుంది. అమెరికాలోని గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో ఈ వ్యోమనౌక భూమిపై అడుగుపెట్టనుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తుది పరీక్షలన్నీ పూర్తి చేసుకుని నిన్న రాత్రి ఇది భూమికి బయలుదేరింది. ఇసైస్‌ హరికేన్‌ ప్రభావం ఉన్నా వ్యోమనౌక భూమిపై దిగేందుకు అనుకూల వాతావరణమే ఉందని ఉత్తర అమెరికా అంతరిక్ష సంస్ధ నాసా తెలిపింది.

అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన మొదటి వ్యాపారసంస్థగా ఎలాన్ మస్క్​కు చెందిన 'స్పేస్ ఎక్స్' చరిత్ర సృష్టించింది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఫాల్కన్​ 9 రాకెట్​ సాయంతో ఇద్దరు వ్యోమగాములు బాబ్​ బెన్​కెన్​, డౌగ్​ హార్లేలను మే 30న నింగిలోకి పంపింది. 19 గంటల ప్రయాణం అనంతరం వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరనున్నారు. ఈ ప్రయోగాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా వీక్షించారు.

ఇవీ చూడండి:

అంతరిక్షయాత్రలో చరిత్ర సృష్టించిన 'స్పేస్​ ఎక్స్​'

అంతరిక్షంలోకి డైనోసార్​.. ఆన్​లైన్​లో భారీ డిమాండ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.