covid vaccine to infants: బ్రెజిల్లో ఓ ఆరోగ్య కార్యకర్త పొరపాటు... ఇద్దరు పసికందులకు పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. రెండు నెలల ఆడ శిశువు, నాలుగు నెలల మగ శిశువుకు ఫైజర్ కొవిడ్ టీకాను వేసింది ఓ నర్సు. ఫలితంగా ఆ చిన్నారులిద్దరూ తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. డిఫ్తిరీయా, టెటనస్, పెర్టుసిస్, హెపటైటిస్ బి వంటి వ్యాధులను ఎదుర్కొనేందుకుగాను రోగ నిరోధక శక్తి కోసం అందించే టీకాకు బదులుగా శిశువులకు సదరు నర్సు కొవిడ్ వ్యాక్సిన్ వేసింది.
Infants hospitalized with pfizer: కొవిడ్ టీకా వేయడం కారణంగా ఇద్దరు పసికందులు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. దీంతో వారిద్దరికి ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శిశువులకు కొవిడ్ టీకా వేసిన నర్సును ఉద్యోగం నుంచి తాత్కాలికంగా తొలగించినట్లు అధికారులు తెలిపారు.
వివిధ దేశాల్లో 5 ఏళ్ల వయసు పిల్లలకు ఫైజర్ టీకాను వినియోగిస్తున్నారు. అయితే.. బ్రెజిల్లో 12 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే ఫైజర్ టీకా వినియోగానికి అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది.
Tags: Brazil vaccine to infants, infants hospitalized after covid vaccine, infants covid vaccine by mistake, pfizer shots to infants
ఇదీ చూడండి: బూస్టర్ డోస్, పిల్లలకు వ్యాక్సిన్‌పై నిర్ణయం అప్పుడే: కేంద్రం
ఇదీ చూడండి: టీకా తీసుకుంటే రూ.50 వేల స్మార్ట్‌ఫోన్ ఫ్రీ- ఆఫర్ వారమే!