ETV Bharat / international

కరోనా టీకా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి?

కరోనా వైరస్​ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని అందరికీ తెలుసు. కానీ కొవిడ్​-19 వ్యాక్సిన్​ కూడా ఒకరి ద్వారా ఇంకొకరికి వ్యాపిస్తుందని తెలుసా? ఫైజర్​ టీకా తీసుకున్న వారిని తాకినా, వారి శరీరం వెదజల్లే పరిమళాన్ని పీల్చినా మన శరీరంలోకీ వ్యాక్సిన్​ చేరుతుందని సామాజిక మధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగింది. మరి ఈ వార్తల్లో నిజమెంత? అసలు సాధ్యమేనా?

pfizer vaccine, vaccine spread
ఫైజర్​ టీకా, టీకా వ్యాప్తి
author img

By

Published : May 9, 2021, 6:31 PM IST

కరోనా టీకాకు సంబంధించి ఓ విషయంపై అమెరికాలో జోరుగా ప్రచారం జరిగింది. కొవిడ్​-19 వ్యాక్సిన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తాయి. ఫైజర్​ టీకా తీసుకున్న వారిని తాకినా, వారి శరీరం వెదజల్లే పరిమళాన్ని పీల్చినా వ్యాక్సిన్​ మన శరీరంలోకి ప్రవేశిస్తుందని అనేక పోస్టులు షేర్​ అయ్యాయి. దీనివల్ల కొందరిపై దుష్ప్రభావం పడుతోందని, ముఖ్యంగా గర్భిణీలపై అధిక ప్రభావం ఉంటోందని వార్తలు వచ్చాయి. టీకా తయారు చేసిన ఫైజర్ సంస్థ కూడా దీన్ని ధ్రువీకరించిందని ప్రచారం సాగడం గమనార్హం.

అయితే ఈ వార్తల్లో నిజానిజాలేంటో తేల్చేందుకు అమెరికా వార్తా సంస్థ అసోసియేటెడ్​ ప్రెస్ న్యూస్​ 'ఫ్యాక్ట్ చెక్' చేసింది. ఫైజర్​ టీకా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదని తేటతెల్లం చేసింది. ఆ సంస్థ కూడా ఈ విషయాన్ని ఎక్కడా ధ్రువీకరించలేదని స్పష్టం చేసింది. వ్యాక్సిన్​ క్లినికల్​ ట్రయల్స్​కు సంబంధించి ఫైజర్​ విడుదల చేసిన 'ప్రోటోకాల్ డాక్యుమెంట్​'లోని ప్రామాణిక భాషను కొందరు తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ అసత్య వార్తలు వ్యాప్తి చెందాయని పేర్కొంది.

సాధ్యం కాదు..

"ఫైజర్​-బయోఎన్​టెక్​ కొవిడ్​-19 టీకా సింథటిక్​ ఎంఆర్​ఎన్​ఏ(mRNA) వ్యాక్సిన్​. దీనిలో ఎలాంటి వైరస్​ కణాలు ఉండవు. శరీరంలో సజీవ వైరస్​ ఉత్పత్తి కూడా కాదు. అందువల్ల శరీరం నుంచి వ్యాక్సిన్​ వెలువడదు." అని ఫైజర్​ అధికార ప్రతినిధి జెరికా పిట్స్​.. అసోసియేటెడ్​ ప్రెస్​కు ఈ-మెయిల్​లో వివరణ ఇచ్చారు. టీకాను శరీరం నుంచి వెలువడే పరిమళం రూపంలో పీల్చడం సాధ్యం కాదని, డోసుగా తీసుకోవడం వల్ల మాత్రమే శరీరంలోకి ప్రవేశిస్తుందని స్పష్టం చేశారు.

ఫైజర్ టీకాకు అమెరికా ఆహార, ఔషధ నియంత్ర సంస్థ(ఎఫ్​డీఏ) గతేడాది డిసెంబర్​లో ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్​ క్లినికల్​ ట్రయల్స్​​కు గర్భిణీలు, పాలిచ్చే తల్లులను దూరంగా ఉంచారు. ట్రయల్స్​లో పాల్గొన్న మహిళలు గర్భం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కొంతభాగం తీసుకొని..

అయితే ఫైజర్ టీకా ట్రయల్స్​కు సంబంధించి నవంబర్​లో ప్రోటోకాల్ డాక్యుమెంట్​ విడుదలైంది. దీనిలోని గర్భిణీలకు సంబంధించిన కొంత భాగాన్ని తీసుకొని కొందరు తప్పుడు పోస్టులు పెట్టారు. వ్యాక్సిన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని, దుష్ప్రభావాలు కూడా ఉంటున్నాయని ప్రచారం చేశారు.

గర్భధారణ సమయంలో ఎలాంటి ప్రభావాలు కనిపించినా చెప్పాలని, గర్భిణీలు ఎవరైనా వ్యాక్సిన్​ తీసుకున్న వారిని తాకడం, లేదా వారి శరీర పరిమళాన్ని పీల్చడం ద్వారా ప్రభావితమవుతున్నారనే అరుదైన ఘటనలు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రోటోకాల్​ డాక్యుమెంట్​లో ఫైజర్​ పేర్కొంది.

అలాంటి వ్యాక్సిన్​ కాదు..

అయితే ఈ డాక్యుమెంట్లోని పదజాలానికి.. సజీవ వైరస్​లను ఉపయోగించే ఇతర వ్యాక్సిన్లతో మాత్రమే సంబంధముంటుందని రట్గర్స్ రాబర్ట్ ఉడ్​ జాన్సన్​ వైద్య కళాశాల ప్రొఫెసర్​ డా.జస్టిన్​ బ్రాంట్ తెలిపారు. బహుశా ఫైజర్​ వ్యాక్సిన్​కు ఇలాంటి వాటితో సంబంధం లేదని ఆమె వివరణ ఇచ్చారు. ఈ టీకాలో సజీవ వైరస్​ ఉండదని స్పష్టం చేశారు.

అరుదుగా, ప్రమాదవశాత్తు జరిగే ఘటనలకు కూడా గుర్తించడానికే ఫైజర్​ ప్రోటోకాల్ డాక్యుమెంట్​లో ఈ తరహా పదజాలాన్ని ​ ఉపయోగించారని రట్గర్స్ రాబర్ట్ ఉడ్​ జాన్సన్​ వైద్య కళాశాలలోని మరో ప్రొఫెసర్​ డా.శోభ స్వామినాథన్​ చెప్పారు. అయితే గర్భిణీలు.. టీకా ఇచ్చేందుకు ఉపయోగించే సిరంజికి దగ్గరగా ఉన్నప్పుడు గానీ, లేక అది విరిగిపోయినప్పుడు గానీ తాకే, పీల్చుకునే అరుదైన ఘటనలు ఉంటాయన్నారు. అలాంటి వాటి వల్ల ప్రభావితం అయ్యే ఘటనలను దృష్టిలో ఉంచుకునే ప్రోటోకాల్ డాక్యుమెంట్లో ప్రస్తావించి ఉండవచ్చన్నారు.

సంతానోత్పత్తిపై ప్రభావం ఉండదు..

వ్యాక్సిన్ వీర్యంలో కలుస్తుందో లేదో ప్రాథమికంగా నిర్ధరణకు రాలేమని స్వామినాథన్ పేర్కొన్నారు. అయితే టీకాలు సంతానోత్పత్తిని ప్రభావితం చేయవని మాత్రం కచ్చితంగా చెప్పగలమన్నారు.

టీకా క్లినికల్​ ట్రయల్స్ ఎంతో శ్రమతో కూడుకున్న ప్రక్రియ అని చాలా మందికి తెలియదని, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వారే తప్పుడు ప్రచారం చేస్తారని మరో ప్రొఫెసర్​ చెప్పారు.

ఇదీ చూడండి: టీకాతో కరోనా నుంచి 96శాతం రక్షణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.