ETV Bharat / international

చౌక వెంటిలేటర్లు రూపొందించిన భారతీయ అమెరికన్​ జంట

author img

By

Published : May 26, 2020, 12:04 PM IST

Updated : May 26, 2020, 12:11 PM IST

కరోనా రోగులకు చికిత్స అందించేందుకు పోర్టబుల్​ వెంటిలేటర్​ నమూనాను రూపొందించారు భారతీయ అమెరికన్ దంపతులు. త్వరలోనే ఉత్పత్తి దశకు చేరుకోనున్న ఈ వెంటిలేటర్లు చౌక ధరకే లభించనున్నట్లు తెలిపారు.

ventilator
చౌక వెంటిలేటర్లు

ఓ భారతీయ అమెరికన్ దంపతులు తక్కువ ధరకు లభించే 'పోర్టబుల్ ఎమర్జెన్సీ వెంటిలేటర్‌'ను అభివృద్ధి చేశారు. త్వరలోనే ఈ వెంటిలేటర్​ ఉత్పత్తి దశకు చేరుకుంటుంది. కరోనా రోగులతో చికిత్స అందించేందుకు భారత్​తో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చౌక ధరలకే లభించనుంది.

ప్రఖ్యాత జార్జి డబ్ల్యూ వుడ్​రఫ్ స్కూల్​ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్​లోని ప్రొఫెసర్​ దేవేశ్ రంజన్​, ఫ్యామిలీ ఫిజీషియన్​గా పనిచేస్తున్న ఆయన భార్య కుముదా రంజన్​ ఈ వెంటిలేటర్​ నమూనాను రూపొందించారు. కరోనా కారణంగా వెంటిలేటర్ల కొరత తీవ్రమైన నేపథ్యంలో 3 వారాల్లోనే ఈ నమూనాను తయారు చేశారు.

"పెద్ద ఎత్తున తయారు చేస్తే ఒక్కో వెంటిలేటర్​కు వంద డాలర్లకన్నా తక్కువ ఖర్చవుతుంది. ఒకవేళ గరిష్ఠంగా 500 డాలర్లకు విక్రయించినా చాలినంత లాభాలు ఆర్జించవచ్చు. ప్రస్తుతం అమెరికాలో ఇలాంటి వెంటిలేటర్లు సగటున 10 వేల డాలర్లకు విక్రయిస్తున్నారు."

- దేవేశ్ రంజన్​

అయితే ఇది ఐసీయూల్లో వాడే వెంటిలేటర్​ కాదని రంజన్​ స్పష్టం చేశారు. ఈ దంపతులు అభివృద్ధి చేసిన 'ఓపెన్​- ఎయిర్​వెంట్​జీటీ'ను కరోనా రోగుల్లో వచ్చే శ్వాసకోశ ఇబ్బందులకు చికిత్స అందించేలా రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ అసలు లక్ష్యం తక్కువ ఖర్చులో వెంటిలేటర్లు అందించటమేనని వైద్యులు కుముదా రంజన్​ స్ఫష్టం చేశారు.

పట్నా నుంచి..

బిహార్​ పట్నాలో పుట్టిన దేవేశ్​ రంజన్​ తిరుచ్చి రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో చదివారు. విస్కోన్సిన్​- మాడిసన్​ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్​తోపాటు పీహెచ్​డీ చేశారు. గత ఆరేళ్లుగా జార్జియా టెక్​లో బోధిస్తున్నారు.

కుముదా ఆరేళ్ల వయసులోనే వారి కుటుంబం అమెరికాలో స్థిరపడింది. న్యూజెర్సీలో వైద్య విద్య అభ్యసించారు. ప్రపంచానికి సరిపోయే వెంటిలేటర్లను తక్కువ ఖర్చులో ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత్​కు ఉందని ఈ దంపతులు విశ్వసిస్తున్నారు.

Last Updated : May 26, 2020, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.