ETV Bharat / international

లాక్​డౌన్​ సమయంలో 7 మిలియన్ల మందికి గర్భం! - united nations

నిరుపేద దేశాల్లోని మహిళలు, బాలికలపై కరోనా తీవ్ర ప్రభావం చూపనుందని ఐక్యరాజ్య సమితి నివేదిక తెలపనుంది. లాక్​డౌన్ కారణంగా అవసరమైన వైద్య సదుపాయాలు, గర్భనిరోధక మందులు అందకపోవడం వల్ల సుమారు 70 లక్షల మందిలో అవాంఛిత గర్భాలకు దారితీస్తుందని అంచనా వేసింది. మహిళ, పురుష అసమానతలు, గృహ హింస వంటి కేసులు ఎక్కువ అవుతాయని పేర్కొంది. మహిళల భద్రత కోసం అత్యవసరంగా చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాలకు సూచించింది.

pregnancies
లాక్ డౌన్ తో అధనంగా 7 మిలియన్ల మందికి ప్రెగ్నెన్సీ!
author img

By

Published : Apr 29, 2020, 2:35 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ఈ వైరస్ ను కట్టడి చేసే క్రమంలో చాలా దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా అవసరమైన వైద్య సదుపాయాలు అందకపోవటం వల్ల అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాల్లో సుమారు 47 మిలియన్ల మంది మహిళలు ఆధునిక గర్భనిరోధక మందులను వినియోగించలేకపోతున్నట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన ఎఫ్​పీఏ దాని భాగస్వామ్య సంస్థలు నివేదికను విడుదల చేశాయి. దీని కారణంగా రానున్న కొన్ని నెలల్లో అదనంగా సుమారు 7 మిలియన్ల మందిలో అవాంఛిత గర్భానికి దారి తీస్తుందని నివేదిక తెలిపింది.

అవెనిర్ హెల్త్, జాన్స్ హోప్ కిన్స్ విశ్వవిద్యాలయం (యూఎస్ ఏ), విక్టోరియల్ విశ్వవిద్యాలయం( ఆస్ట్రేలియా) సంయుక్తంగా డేటాను విడుదల చేశాయి. ఆయా దేశాలు మహిళలు, బాలికల భద్రత, హక్కులు, సంక్షేమం కోసం అత్యవసర చర్యలు చేపట్టకపోతే.. భవిష్యత్తు భయంకరంగా ఉండే అవకాశం ఉందని నివేదిక తేల్చింది.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల కారణంగా.. కుటుంబ నియంత్రణ సౌకర్యం పొందలేకపోతున్నవారు అవాంఛిత గర్భాలకు గురవుతారు. గృహహింస, ఇతర హింసలకు గురయ్యే మహిళల సంఖ్య మిలియన్ల కొద్ది పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై కొవిడ్-19 విపత్తు ప్రభావం అధికంగా ఉండనుంది. స్త్రీ, పురుష అసమానతలు పెరిగిపోతాయి. మిలియన్ల మంది మహిళలు, బాలికలు తమ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించే సామర్థ్యం, ఆరోగ్యాన్ని కాపాడుకునే సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

– నటాలియా కనెమ్, యూఎన్ ఎఫ్ పీఏ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్.

6 నెలల పాటు కొనసాగితే..

నివేదిక ప్రకారం.. అంతర్జాతీయంగా 114 నిరుపేద దేశాల్లో సుమారు 450 మిలియన్ల మంది మహిళలు గర్భనిరోధక మందులు వాడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా 6 నెలల పాటు వైద్య, ఇతర సదుపాయాలకు అంతరాయం ఏర్పడితే.. 47 మిలియన్ల మంది మహిళలు ఆధునిక గర్భనిరోధకాలు వినియోగించలేకపోతారు. దీని వల్ల సుమారు 7 మిలియన్ల మందిలో అధనంగా అనాలోచిత గర్భాలకు దారితీస్తుంది. ఆరు నెలల లాక్ డౌన్ తో అదనంగా 31 మిలియన్ల గృహ హింస కేసులు పెరుగుతాయి. మహిళల్లో సున్తీ (ఎఫ్ జీఎం), బాల్య వివాహాలు వంటి వాటిని రూపుమాపేందుకు చేపట్టే కార్యక్రమాల జాప్యానికి ఈ మహమ్మారి కారణమవుతుంది. దాని ఫలితంగా వచ్చే దశాబ్ద కాలంలో 2 మిలియన్లకుపైగా ఎఫ్ జీఎం కేసులు నమోదవుతాయి. వచ్చే 10 ఏళ్లలో 13 మిలియన్లకు పైగా బాల్య వివాహాలు జరుగుతాయి.

కొవిడ్-19 కారణంగా ఆస్పత్రులు కిక్కిరిసిపోవటం, చాలా సేవలు చాలా తక్కువగా అందుబాటులో ఉండంటం మహిళలు, బాలికలపై తీవ్ర ప్రభావం చూపనుందని నివేదిక తేల్చింది. అదే సమయంలో చాలా మంది మహిళలు వైరస్ సోకుతుందనే కారణంగా వైద్య పరీక్షలకు దూరమయ్యే అవకాశం ఉందని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.