ETV Bharat / international

కరోనా మహమ్మారిపై పోరుకు రోబో అస్త్రం!

మనుషులు చికిత్స చేసేందుకు అవరోధాలు ఏర్పడినప్పుడు, కరోనా వైరస్​లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు కొన్ని దేశాల్లో రోబోలను ఉపయోగిస్తున్నారు. గదులను శుభ్రం చేయడం నుంచి రోగులకు మందులు సరఫరా చేయడం వరకు వివిధ పనులకు వీటిని వాడుతున్నారు. భారత్​లోనూ ఇటువంటి రోబోల వాడకానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

robot doctor
డాక్టర్ రోబో
author img

By

Published : Apr 2, 2020, 8:20 AM IST

కొవిడ్‌-19పై ప్రపంచం యుద్ధం చేస్తున్న తరుణంలో కొన్ని దేశాల్లోని ఆరోగ్య కార్యకర్తలు వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు రోబోలను ఉపయోగిస్తున్నారు. అలాంటి రోబోల విశేషాలివీ..

కాంతి పడితే వైరస్‌ భస్మమే..

వైరస్‌ జాపింగ్‌ రోబోగా పిలిచే ఈ యంత్రం ఆసుపత్రుల గదుల్లోకి దానంతట అదే వెళుతుంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు దీని నుంచి అతినీలలోహిత కాంతి కిరణాలు వెలువడి అక్కడి ఉపరితలాలపై ఉన్న వైరస్‌ను నాశనం చేస్తాయి.

robot doctor
కాంతి పడితే వైరస్‌ భస్మమే..

టెలీ హెల్త్‌

5జీ సాయంతో పనిచేసే ఈ అత్యాధునిక రోబోల సహాయంతో మారుమూల ప్రాంతాల్లోని రోగుల వివరాలను కూడా ఆసుపత్రిలోనే కూర్చుని వైద్యులు విశ్లేషించొచ్చు. వైద్యసేవలు అందించవచ్చు.

robot doctor
టెలీ హెల్త్‌

ఆపన్న హస్తం

చైనా రాజధాని బీజింగ్‌లోని జిన్హువా విశ్వవిద్యాలయం దీనిని తయారు చేసింది. ఈ చెయ్యి ఉన్న గదిలో రోగిని పడుకోబెడతారు. ఆయన నోటి నుంచి స్వాబ్స్‌ సేకరించడం, అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌లు చేయడం వంటి పనులను ఈ రోబో చేస్తుంది. అనంతరం ఆ సమాచారాన్ని వైద్యులు విశ్లేషించి రోగికి చికిత్సను నిర్ణయిస్తారు.

robot doctor
ఆపన్న హస్తం

గస్తీ మిత్రుడు

ఈ రోబోను చైనా సంస్థ క్లౌడ్‌ మైండ్స్‌ తయారు చేసింది. ఆసుపత్రికి వచ్చిన సందర్శకుల ఉష్ణోగ్రత పరిశీలించడం, వారిని గుర్తించడంలో సహాయ పడడంతోపాటు రోగులు తిరిగిన ప్రాంతాలను శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది.

robot doctor
గస్తీ మిత్రుడు

భారత్‌లోనూ.. ప్రయోగాలు

robot doctor
రోబో డాక్టర్
  • ఆసుపత్రులను శుభ్రం చేయడం, రోగులకు మందులు, ఆహారం సరఫరా చేయడం, వారి శరీర ఉష్ణోగ్రతలను నమోదుచేయడం వంటి పనులకు రోబోలను వినియోగించే దిశగా భారత్‌లో ప్రయోగాలు ఊపందుకున్నాయి.
  • రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో ఉన్న స్వామీ మాన్‌సింగ్‌ ప్రభుత్వ ఆసుపత్రి తమ దగ్గర చికిత్స పొందుతున్న కొవిడ్‌-19 రోగులకు మందులు, ఆహారం అందజేసే పనులకు రోబోలను వినియోగించడంపై ప్రయోగపరీక్షలు నిర్వహిస్తోంది.
  • కేరళకు చెందిన స్టార్టప్‌ అసిమోవ్‌ రోబోటిక్స్‌ ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్న రోగులకు సహకరించేందుకు మూడు చక్రాల రోబోని తయారుచేసింది.

ఇదీ చదవండి: బీసీజీ టీకా కరోనాకు రక్షణ కవచమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.