ETV Bharat / international

కరోనా ఉన్మాదం: దుకాణంలో సరకులను నాలుకతో...

అమెరికాలో ఓ మహిళ సూపర్​ మార్కెట్​లో ఆహార పదార్థాలను కావాలనే ఎంగిలి చేసింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది.

licking-1800-dollars-worth-of-groceries
సూపర్​ మార్కెట్​లో ఆహార పదార్థాలు ఎంగిలి చేసిన మహిళ
author img

By

Published : Apr 9, 2020, 11:42 AM IST

కరోనా దెబ్బకు అమెరికా ప్రజలు హడలిపోతున్నారు. ఈ తరుణంలో కాలిఫోర్నియాలో ఓ మహిళ చేసిన పని స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సూపర్​ మార్కెట్​లో సరకులు కొనడానికి వెళ్లిన ఆమె రూ.లక్షా 38వేలు విలువ చేసే ఆహార పదార్థాలను ఎంగిలి చేసింది. కొన్ని ఆభరణాలనూ నోటితో తడి చేసింది. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

"ఆ మహిళ మొదట ఆభరణాలను నాలుకతో నాకి, చేతికి ధరించింది. తర్వాత ఆహార పదార్థాలను కూడా ఎంగిలి చేసింది" అని సూపర్​ మార్కెట్ సిబ్బంది తెలిపారు. ఆ మహిళను జెన్నిఫర్​ వాకర్​గా గుర్తించారు పోలీసులు. సరకులు కొనడానికి సరిపడా ఆమె వద్ద డబ్బులు లేవని చెప్పారు.

మాంసం, మద్యం సహా ఇతర వస్తువులు కార్ట్​లో ఉన్నాయి. వీటిన్నింటినీ ధ్వంసం చేయనున్నట్లు తెలిపారు పోలీసులు.

ఇదీ చూడండి: భారత్ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోం: ట్రంప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.