ప్రపంచంపై కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,26,25,156 మందికి కరోనా సోకింది. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 5,62,769 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్ దేశాలపై కరోనా వైరస్ పంజా విసురుతోంది.
అగ్రరాజ్యంలో ఒక్కరోజులోనే కొత్తగా 71 వేల కేసులు నమోదయ్యాయి. మరో 849 మంది మరణించారు. బ్రెజిల్లోనూ వైరస్ విజృింభిస్తోంది. శుక్రవారం మరో 45 వేలమందికిపైగా కరోనా బారినపడ్డారు. 1270 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశం | కేసులు | మృతులు |
అమెరికా | 32,91,786 | 1,36,671 |
బ్రెజిల్ | 18,04,338 | 70,524 |
రష్యా | 7,13,936 | 11,017 |
పెరూ | 3,19,646 | 11,500 |
చిలీ | 3,09,274 | 6,781 |
స్పెయిన్ | 3,00,988 | 28,403 |
మెక్సికో | 2,89,174 | 34,191 |
బ్రిటన్ | 2,88,133 | 44,650 |
ఇరాన్ | 2,52,720 | 12,447 |
సెనేట్ అధ్యక్షురాలికి...
బొలీవియా సెనేట్ అధ్యక్షురాలు 'మోనికా ఇవా కోపా'కు కరోనా వైరస్ నిర్థరణ అయ్యింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. వర్చువల్ విధానంలో విధులు నిర్వర్తిస్తానని వెల్లడించారు. ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలికి కరోనా సోకినట్టు ప్రకటించిన ఒక రోజు అనంతరం మోనికా ఈ ప్రకటన చేయడం గమనార్హం.
బొలీవియావ్యాప్తంగా 44 వేల కేసులు నమోదయ్యాయి. 1,600 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:- లాక్డౌన్లో బర్త్డే పార్టీ.. రూ. లక్షల్లో జరిమానా