ETV Bharat / international

రెండేళ్లలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదైన దేశాలేవో తెలుసా? - కరోనా న్యూస్ టుడే

Corona free countries: కరోనా మహమ్మారి ధాటికి దాదాపు ప్రపంచంలోని దేశాలన్నీ విలవిల్లాడాయి. రోజుకు లక్షల కేసులు, వేల మరణాలు నమోదై ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. కానీ కొన్ని దేశాల్లో మాత్రం కొవిడ్​ కేసులు సింగిల్ డిజిట్​కే పరిమితమయ్యాయి. అక్కడ మరణాలు ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఆ దేశాలేంటో ఇప్పుడు చూద్దాం.

countries with single digit corona cases
ఇప్పటి వరకు ఒక్కటే కరోనా కేసు నమోదైన దేశాలేంటో మీకు తెలుసా?
author img

By

Published : Dec 27, 2021, 5:24 PM IST

Corona free countries: కరోనా సృష్టించిన విధ్వంసానికి ప్రపంచ దేశాలు వణికిపోయాయి. ఊహించని రీతిలో కేసులు, మరణాలతో అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. రోజుకు లక్షల కేసులు, వేల మరణాలతో శవాలను కుప్పలుగా ఖననం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్ని దేశాల్లో మాత్రం కరోనా కేసులు సింగిల్ డిజిట్​కే పరిమితం అయ్యాయి. వైరస్ కారణంగా ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. ఆరోగ్య అత్యవసర పరిస్థితి అంటే ఏంటో కూడా వాటికి తెలియదు. ఆ దేశాలేంటో ఇప్పుడు చూద్దాం.

టోంగా

ఇది దక్షిణ పసిఫిక్ సముద్రంలో 170 ద్వీపకల్పాలతో ఏర్పడిన దేశం. ఇక్కడ ఇప్పటివరకు ఒక్కటే కరోనా కేసు నమోదైంది. ఈ దేశ జనాభా 1,07,471 మాత్రమే.

మైక్రోనేషియా

ఇది కూడా పసిఫిక్ మహాసముద్రంలో 600 ద్వీకల్పాలతో ఏర్పడిన దేశం. మొత్తం నాలుగు రాష్ట్రాలుంటాయి. ఇక్కడా ఇప్పటివరకు ఒకే ఒక్క కరోనా కేసు నమోదైంది. ఈ దేశం మొత్తం జనాభా 1,16,811.

సెయింట్ హెలెనా

సెయింట్ హెలెనా బ్రిటిష్​ విదేశీ భూభాగంలోని ద్వీపకల్ప దేశం. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉండే ఈ ప్రాంతంలో ఇప్పటివరకు రెండే కరోనా కేసులు వెలుగుచూశాయి. ఈ ఇద్దరు కూడా కోలుకున్నారు. ఈ దేశ మొత్తం జనాభా కేవలం 6,104 కావడం గమనార్హం. నెపోలియన్ ఇక్కడే మరణించారని చెబుతారు.

సమోవా

రెండు ద్వీపకల్పాలతో ఏర్పడిన ఈ దేశంలో ఇప్పటివరకు ముడు కరోనా కేసులే నమోదయ్యాయి. బాధితులు కూడా పూర్తిగా కోలుకున్నారు. ఈ దేశ జనాభా 2,00,396.

మార్షల్ ఐలాండ్స్​..

మధ్య పసిఫిక్​ సుమద్రంలో ద్వీపకల్పాల సమూహమే మార్షల్ ఐలాండ్స్​. ఇక్కడ ఇప్పటివరకు 4 కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితులంతా కోలుకున్నారు. దీని జనాభా 59,782.

వానువాటు

దక్షిణ పసిఫిక్​ సముద్రంలో 80 ద్వీపకల్పాల సమూహమే ఈ దేశం. ఇక్కడ మొత్తం 7 కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో ఒక్కరు మరణించారు. మిగతా ఆరుగురు కోలుకున్నారు. ఈ దేశ జనాభా 3,17,775.

పలావ్​

పశ్చిమ పసిఫిక్ సముద్రంలో 500 ద్వీపకల్పాలతో ఏర్పడిన దేశం ఇది. మైక్రోనేషియాలో భాగంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 8 కరోనా కేసులు నమోదయ్యాయి. అందరూ కోలుకున్నారు. ఈ దేశ జనాభా 18,222.

ఎంఎస్​ జాండ్యామ్​..

ఇది హాలాండ్​ అమెరికా లైన్​కు చెందిన క్రూజ్ షిప్​. నెదర్లాండ్స్ అమ్​స్టర్​డాం సమీపంలోని జాండ్యామ్ నగరం పేరును దీనికి పెట్టారు. ఇందులో మొత్తం 9 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కోలుకోగా.. ఇద్దరు మరణించారు.

పశ్చిమ సహారా..

వాయవ్య తీరంలో ఉత్తర, పశ్చిమ ఆఫ్రికాలోని మాగ్రెబ్ ప్రాంతంలో వివాదాస్పద భూభాగం పశ్చిమ సహారా. ఇక్కడ ఇప్పటివరకు 10మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 8మంది కోలుకోగా.. ఒకరు మరణించారు. ప్రస్తుతానికి ఒక్క యాక్టివ్ కేసు ఉంది. దీని జనాభా 6,19,087.

ఇదీ చదవండి: మేకలు ఎక్కడున్నాయో చెప్పే మ్యాప్​.. ఆ లవర్స్​ కోసమే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.