ETV Bharat / international

అంబేడ్కర్​ గౌరవార్థం అమెరికా చట్టసభలో తీర్మానం

అంబేడ్కర్​ 130వ జయంతి సందర్భంగా.. అమెరికా ప్రతినిధుల సభలో ఓ సభ్యుడు తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రపంచ దేశాల్లోని యువనేతలు.. అంబేడ్కర్​ చూపిన సమానత్వంతో ప్రేరణ పొందాలని పేర్కొన్నారు. వైశాఖి పండుగ ప్రాముఖ్యతను గుర్తించాలని మరో సభ్యుడు తీర్మానం ప్రవేశపెట్టారు.

ambedkar
అంబేడ్కర్​పై అమెరికా చట్టసభలో తీర్మానం
author img

By

Published : Apr 15, 2021, 1:09 PM IST

భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్​ బీఆర్​​ అంబేడ్కర్​ గౌరవార్థం అమెరికా కాంగ్రెస్​లో వరుసగా రెండోసారి భారతీయ అమెరికన్​ సభ్యుడు ఆర్​ఓ ఖన్నా బుధవారం.. ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. అంబేడ్కర్​ 130వ జయంతి సందర్బంగా.. ప్రపంచ దేశాల్లోని యువనేతలు ఆయన చూపించిన సమానత్వ మార్గం ద్వారా స్ఫూర్తి పొందాలని పేర్కొన్నారు.

"అందరికీ సమానమైన గౌరవం అని భావించే అమెరికా, భారత్​ పక్షాన అంబేడ్కర్​ పోరాడారు." అని అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం ఆర్​ఓ ఖన్నా ట్వీట్​ చేశారు.

"అంబేడ్కర్​ గౌరవార్థం నేను ఈరోజు మరోసారి.. తీర్మానం ప్రవేశపెడుతున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువనేతలు అంబేడ్కర్​ చూపించిన సమానత్వం మార్గం ద్వారా ప్రేరణ పొందుతారని ఆశిస్తున్నాను. దళితుడైన అంబేడ్కర్​ తనంతట తానుగా పైకి ఎదిగి, భారత రాజ్యాంగాన్ని రచించారు. దాని ద్వారా ఎంతో మంది భారతీయులు తమ హక్కులను కాపాడుకోగులుగుతున్నారు. అదే విధంగా.. నువ్వు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చావు? అనే దానితో సంబంధం లేకుండా.. ప్రతివ్యక్తి ఆ దేవుడు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయగలుగుతాడని మేం నమ్ముతాం."

-ఆర్​ఓ ఖన్నా, అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు

వైశాఖి పండుగపై తీర్మానం..

వైశాఖి పర్వదినం సందర్భంగా.. అమెరికా ప్రతినిధుల సభలో జాన్​ గారమేండి అనే సభ్యుడు ఓ తీర్మానం ప్రవేశ పెట్టారు. చరిత్రాత్మక, సాంస్కృతిక, మతపరమైన ఈ పండుగ ప్రాముఖ్యతను గౌరవించాలని కాంగ్రెస్​ సభ్యుడు తీర్మానంలో తెలిపారు. అమెరికా చట్టసభలో సిక్కు సామాజిక వర్గానికి జాన్ ​గారమేండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

వసంత రుతువు ప్రారంభానికి చిహ్నంగా వైశాఖి పండుగను హిందువులు, బుద్ధులు, సిక్కులు వేర్వేరు పేర్లతో జరుపుకుంటారు.

ఇదీ చూడండి:'మే 1 నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ'

ఇదీ చూడండి:'పాక్‌ రెచ్చగొడితే.. భారత్‌ స్పందన గట్టిగానే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.