ETV Bharat / international

ఎట్టకేలకు మోస్ట్​ వాంటెడ్​ డ్రగ్స్​ వ్యాపారి అరెస్ట్​

author img

By

Published : Oct 24, 2021, 4:59 PM IST

దేశంలోనే మోస్ట్ వాంటెడ్ మాదకద్రవ్యాల వ్యాపారిని పట్టుకున్నాయి కొలంబియా భద్రతా బలగాలు. అవినీతి అధికారుల అండ, ప్రైవేటు సైన్యం రక్షణతో పదేళ్లుగా పరారీలో ఉన్న డైరో ఆంటోనియా ఉసుగా అలియాస్​ ఒటోనియల్​.. అధికారులకు ఎట్టకేలకు చిక్కాడు.

Colombia's most wanted drug lord
మోస్ట్​ వాంటెడ్​ డ్రగ్స్​ వ్యాపారి అరెస్ట్​

మోస్ట్​ వాంటెడ్​ మాదకద్రవ్యాల వ్యాపారి డైరో ఆంటోనియా ఉసుగా అలియాస్​ ఒటోనియల్​.. కొలంబియా భద్రతా బలగాలకు పట్టుబడ్డాడు. అవినీతి అధికారుల అండతో దశాబ్ద కాలంగా రహస్యంగా తిరిగిన ఉసుగా ఎట్టకేలకు కొలంబియా సైన్యానికి చిక్కాడు. ఈ మేరకు రబ్బరు బూట్లు, సంకెళ్లు వేసిన ఉసుగా ఫొటోలను విడుదల చేశారు అధికారులు. ఉసుగా అరెస్ట్​ను మూడు దశాబ్దాల క్రితం పాబ్లో ఎస్కోబార్​ను పట్టుకోవడంతో పోల్చారు ఆ దేశ అధ్యక్షుడు ఇవాన్​ డ్యూక్​.

Colombia's most wanted drug lord
డైరో ఆంటోనియా ఉసుగా

రూ.37 కోట్ల లక్షల రివార్డు

ఒటోనియల్​.. దట్టమైన అరణ్యాల గుండా మాదకద్రవ్యాల (కొకైన్) స్మగ్లింగ్​ చేసే గల్ఫ్ క్లేన్​ బృందానికి నాయకుడిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా ఉత్తర అమెరికా, మధ్య అమెరికాలకు డ్రగ్స్​ను తరలించేందుకు అనువైన ప్రధాన మార్గాలపై నియంత్రణ సాధించేందుకు హత్యలు చేసి.. ఆ ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఒటోనియల్​ను పట్టుకోవడానికి అమెరికా పోలీసులు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. అమెరికా డ్రగ్​ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్​.. మోస్ట్ వాంటెడ్​ క్రిమినల్స్​ జాబితాలో చాలాకాలం ఉంచింది. అతనిపై రూ.37కోట్ల 50 లక్షలు (50 మిలియన్​ డాలర్లు) రివార్డు ప్రకటించింది అమెరికా.

Colombia's most wanted drug lord
డైరో ఆంటోనియా ఉసుగా

ఉసుగాపై తొలిసారిగా 2009లో.. అమెరికా నిషేధిత తీవ్రవాద సంస్థకు సాయం, మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నట్లు మన్​హట్టన్​ ఫెడరల్ కోర్టులో ఉసుగాపై అభియోగాలు మోపారు అధికారులు. 2003 నుంచి 2014 వరకు వెనిజులా, గ్వాటెమాల, మెక్సికో, పనామా, హోండురాస్ దేశాల ద్వారా 73 మెట్రిక్​ టన్నుల డ్రగ్స్​ అమెరికాకు చేరవేసినట్లు నేరారోపణలు రుజువవడం వల్ల బ్రూక్లిన్​, మయామి ఫెడరల్​ కోర్టులు ఉసుగాను దోషిగా తేల్చాయి.

Colombia's most wanted drug lord
చేతులకు సంకెళ్లు వేసి ఉన్న ఉసుగా

అవినీతి అధికారుల అండతో..

అయితే తన కింద ఉన్న 500 మందికిపైగా ప్రైవేటు సైన్యం, అమెరికా, బ్రిటన్​కు చెందిన కొందరు అవినీతి అధికారుల సాయంతో ఏళ్లతరబడి అడవుల్లోని రహస్య స్థావరంలో ఉసుగా తలదాచుకున్నట్లు అధికారులు తెలిపారు. కొలంబియాకు చెందిన గైటానిస్ట్​ సెల్ఫ్​ డిఫెన్స్​ ఫోర్సెస్‌కు ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఇమ్రాన్​ఖాన్​ సర్కారుకు నిరసన సెగ.. రోడ్లపైకి ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.