అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కొలిన్ పావెల్‌ను(Colin powell News) కరోనా బలితీసుకుంది. 84 ఏళ్ల పావెల్.. వాల్టర్ రీడ్ నేషనల్ మెడికల్ సెంటర్‌లో చికిత్స తీసుకుంటూ కన్నుమూసినట్లు(Former Us Secretary Of State Dies) ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పావెల్ పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకున్నారని వెల్లడించారు.
జార్జి బుష్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో 2001 నుంచి 2005 వరకు పావెల్ అమెరికా విదేశాంగ మంత్రిగా పని చేశారు. అమెరికా రక్షణ శాఖలో కీలకంగా భావించే జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్స్‌కు ఆయన తొలి నల్ల జాతి ఛైర్మన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ హోదాలో 1991లో కువైట్ నుంచి ఇరాక్ సేనలను తరిమికొట్టడంలో కీలక పాత్ర పోషించారు.
పావెల్(Colin Powell News) మృతి పట్ల అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ విచారం వ్యక్తం చేశారు. ఆయన గొప్ప ప్రజా సేవకుడు అని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: