ETV Bharat / international

'నేను మళ్లీ అధ్యక్షుడిని అవ్వకపోతే.. ఇక అంతే'

author img

By

Published : Jun 6, 2020, 5:47 PM IST

మరో ఐదు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో.. సానుకూలతలపై ట్రంప్​ దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. వైరస్​పై విజయంతో సహా అనేక విషయాల్లో దేశం పుంజుకుందని వెల్లడించారు ట్రంప్​. ప్రజలు మరోమారు తనను ఎన్నుకోకపోతే.. పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు.

Citing jobs, Trump claims victory over virus, econ collapse
'నేను మళ్లీ అధ్యక్షుడిని అవ్వకపోతే.. ఇక అంతే'

కరోనా వైరస్​పై విజయం సాధించి, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. జాతి వివక్ష నిర్మూలనలో పురోగతి సాధించినట్టు వెల్లడించారు. నిరుద్యోగం విషయంలో సానుకూల నివేదిక అందిందని పేర్కొన్నారు. శ్వేతసౌధంలో శుక్రవారం చేసిన ప్రసంగంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు ట్రంప్​.

అమెరికావ్యాప్తంగా సామాజిక అస్థిరత్వం నెలకొంది. కరోనా వైరస్​ మృతుల సంఖ్య ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. నిరుద్యోగం విషయంలో అమెరికన్లలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతోంది. మాన్​మౌత్​ విశ్వవిద్యాలయం నిర్వహించిన పోల్స్​ ప్రకారం.. 10మంది ఓటర్లలో కేవలం ఇద్దరే దేశం సరైన దిశలో అడుగులు వేస్తోందని భావించారు. ఇన్ని క్లిష్టపరిస్థితుల్లో అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్​ సన్నద్ధమవుతున్నారు. అగ్రరాజ్యాన్ని మరో నాలుగేళ్ల పాటు పాలించేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నారు ట్రంప్​. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్​ సహా అన్ని ప్రతికూల అంశాలపై పట్టు సాధిస్తున్నట్టు వెల్లడించారు. అభివృద్ధి దిశగా పయనిస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు.

జాతి వివక్షపై...

ఆఫ్రో-అమెరికన్​ జార్జ్​ ఫ్లాయిడ్​ మరణంతో చెలరేగిన నిరసనలను కూడా ట్రంప్​ ప్రస్తావించారు. ఆందోళనలు తగ్గుముఖం పట్టాయని, జాతి వివక్ష నిర్మూలనలో మంచి పురోగతి సాధించినట్టు వివరించారు. సమానత్వం పరంగా దేశం సరైన మార్గంలోనే నడుస్తోందని ఫ్లాయిడ్​ కూడా అనుకునే వాడని అభిప్రాయపడ్డారు.

అమెరికా చరిత్రలో మరే ఇతర అధ్యక్షులు చేయనంతగా.. నల్ల జాతి అమెరికన్ల అభివృద్ధికి తాను కృషి చేసినట్టు వివరించారు. జాతికి సంబంధించిన విషయాల్లో ఆర్థికపరంగా పుంజుకోవడమే అత్యంత గొప్ప విషయమన్నారు.

ఆ రిపోర్టుతో...

ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ట్రంప్​కు చిన్న ఉపశమనం కలిగించే విధంగా ఓ నివేదిక బయటకు వచ్చింది. గత నెలలో 2.5 మిలియన్​(25లక్షలు) మందిని యజమానులు ఉద్యోగంలో చేర్చుకున్నట్టు ఆ నివేదిక పేర్కొంది. దీనిని వెంటనే అందిపుచ్చుకున్న ట్రంప్​.. అన్ని సమస్యల నుంచి దేశం గట్టెక్కుతోందని వ్యాఖ్యానించారు.

విపక్షాలు ఫైర్​...

అయితే అభివృద్ధివైపు ట్రంప్​ ఎంత దృష్టిపెట్టాలనుకున్నా... విపక్షాలు మాత్రం ట్రంప్​ వైఫల్యాలను ఎత్తిచూపిస్తున్నాయి. కరోనా వైరస్​పై ట్రంప్​ తీరును తప్పుబడుతున్నారు నేతలు. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరఫున పోటీ చేయాలనుకుంటున్న జో బిడెన్​ వీటి నుంచి లబ్ధిపొందాలనుకుంటున్నారు. మిలియన్ల మంది అమెరికన్లు ఇంకా ఉద్యోగాలకు వెళ్లడం లేదని అంటున్నారు. ఇది దేవుడి మీద వదిలేసే విషయం కాదని.. కేవలం అధ్యక్షుడి వైఫల్యమేనని తేల్చిచెబుతున్నారు. కరోనా వైరస్​ను అరికట్టడంపై ట్రంప్​ ప్రదర్శించిన తీరుతోనే నిరుద్యగం పెరిగిపోయిందని మండిపడ్డారు. ట్రంప్​ ఇకనైనా బంకర్ల నుంచి బయటకు వచ్చి పరిస్థితులను స్వయంగా చూడాలని ఎద్దేవా చేశారు.

'నేను రాకపోతే.. ఇక అంతే'

అయితే విమర్శలను ట్రంప్​ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వైరస్​ కట్టడిలో తన వైఖరిని మరోమారు సమర్థించుకున్నారు. తాను చర్యలు చేపట్టకపోయుంటే.. 10లక్షలమంది ప్రాణాలు కోల్పోయేవారని తెలిపారు.

అనేక రంగాల్లో దేశం ఇప్పటికే పుంజుకుందని అభిప్రాయపడ్డారు ట్రంప్​. అమెరికా చరిత్రలోనే ఇదొక గొప్ప విషయంగా అభివర్ణించారు. 'అగ్రరాజ్యం అభివృద్ధికి నేను ఒక్కడినే దిక్కు' అని.. అధ్యక్షుడిగా తనను తిరిగి ఎన్నుకోకపోతే.. దేశం మరింత కష్టాల్లోకి జారుకుంటుందని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.