ETV Bharat / international

బైడెన్ గెలుపుపై చైనా గంపెడాశలు- కారణాలివే...

ప్రస్తుతం అమెరికా-చైనా మధ్య.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి పరిస్థితులు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య అగాధం.. చరిత్రలో ముందెన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ఇరుదేశాధినేతల దూకుడు ధోరణి.. వాషింగ్టన్​-బీజింగ్ మధ్య దూరం పెంచేసింది. వాణిజ్య యుద్ధంతో పరస్పరం విరిచుకుపడిన దేశాల మధ్య.. కరోనా మరో చిచ్చుపెట్టింది. కరోనా మహమ్మారి, సాంకేతికత, వాణిజ్యం, భద్రతలతో పాటు గూఢచర్యంపై విభేదాల మధ్య యుఎస్-చైనా సంబంధాలు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. అయితే... బైడెన్​ గెలిస్తే పరిస్థితులు మారే అవకాశముందని డ్రాగన్ భావిస్తోంది.

China hopes Biden wins
బైడెన్ గెలుపుపై చైనా గెంపెడాశలు.. మరి పరిస్థితులు మారతాయా ?
author img

By

Published : Oct 23, 2020, 4:02 PM IST

నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలిస్తే.. వాణిజ్యం, సాంకేతికత, భద్రత వంటి అంశాలపై వాషింగ్టన్​తో కయ్యాలకు తెర​ పడుతుందని చైనా నాయకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికన్ రాజకీయ వర్గాల్లో.. అంతటా బీజింగ్ పట్ల అసహనం, ఆగ్రహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేయలేని పరిస్థితి.

విభేదాలతో చిక్కులు..

రిపబ్లికన్, డెమొక్రటిక్ సభ్యులందరూ.. చైనాపై సమయం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారే తప్ప, స్నేహహస్తం చాచే పరిస్థితులు కనిపించటంలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులు.. చైనాపై వైఖరి మరింత కఠినంగా మార్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.

ఇరుదేశాల మధ్య చాలా అంశాల్లో విభేదాలున్నా... ప్రధానంగా బీజింగ్ వాణిజ్య విధానం, హాం​కాంగ్​ వివాదం, తైవాన్, టిబెట్​పై చైనా వైఖరి.. అలాగే జిన్​పింగ్​ సారథ్యంలోని కమ్యూనిస్ట్​ పార్టీ వీగర్​ ముస్లింలపై చేస్తున్న అరాచకాలు ఇరుదేశాల సంబంధాలను క్లిష్టతరం చేస్తున్నాయి.

అమెరికాలోని ప్రధాన నగరాల్లో మార్చిలో నిర్వహించిన 'ప్యూ రీసెర్చ్'​లో.. రెండింట-మూడొంతుల మంది అమెరికన్లు చైనాపై సదాభిప్రాయం లేదని వెల్లడించారు. ఈ తరుణంలో బైడెన్ సహా వేరే నేతలెవరైనా డ్రాగన్​కు మద్దతుగా మాట మాట్లాడితే, వారి భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లే అంటున్నారు విశ్లేషకులు.

2016లో..

2016 ఎన్నికల సమయంలో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. నేడు ట్రంప్​ మరోసారి వైటహౌస్​లోకి రావొద్దని కోరుకుంటున్న చైనా నిపుణులు.. నాడు పూర్తి మద్దతు తెలిపారు. హిల్లరీ క్లింటన్​ గెలవకూడదని అశించారు. అంతకుముందు బరాక్​ ఒబామా తీసుకొచ్చిన విదేశాంగ విధానంలో.. మానవ హక్కులపై బీజింగ్​పై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. హిల్లరీ ఇదే విధానం కొనసాగిస్తారన్న భయంతో మద్దతుగా నిలవలేదు. నాటి ట్రంప్​ వ్యాపారవేత్త ఇమేజీ చైనాయులను బాగా ఆకట్టుకుంది.

చైనాకు షాక్ !

అయితే, ప్రస్తుతం ట్రంప్​ సాగించిన సుంకాల యుద్ధం, చైనా దురాక్రమణలపై ఆగ్రహం వ్యక్తం చేయటం బీజింగ్​కు షాకిచ్చాయి. భారత్​తో ట్రంప్​ బలమైన దోస్తీ నెరపటం సైతం రుచించలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో.. బైడెన్​ గెలిస్తే కాస్త మెతక వైఖరి అవలంబించే అవకాశాలున్నాయని చైనా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బైడెన్​ పాలన... ట్రంప్ ప్రభుత్వంలాగా భావోద్వేగంగా, హాస్యాస్పదంగా ఉండదు.

-యూ వనిల్​, ప్రొఫెసర్, బీజింగ్​ విశ్వవిద్యాలయం

డెమొక్రాట్ల భావజాలం.. మరీ అంత కటువుగా ఉండదు కాబట్టి వారు పరిమిత సైనిక సంఘర్షణలను కూడా నివారించడానికి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే చైనాతో సంక్షోభ నిర్వహణ, సంబంధాల నిర్వహణపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు.

-షీ యిన్​హాంగ్​, ప్రొఫెసర్, బీజింగ్​ విశ్వవిద్యాలయం

అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం ?

అమెరికా​ భద్రతాధికారులు సైతం.. ట్రంప్​ మరోసారి గెలవటం చైనాకు ఇష్టం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు, లేదంటే పరోక్షంగా బైడెన్​కు మద్దతిచ్చేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయంటున్నారు.

ఇదీ చూడండి: 'ఎన్నికల్లో జోక్యం చేసుకుంటే ఎవ్వరినీ వదిలిపెట్టను'

ట్రంప్​ వైఖరి

ట్రంప్​ చైనాపై కఠిన వైఖరి అవలంబించారు. 2018లో చైనా దిగుమతులపై సుంకాల యుద్ధం ప్రకటించారు. చైనా సాంకేతిక చౌర్యంపైనా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఆంక్షలతో విరుచుకుపడ్డారు. చైనా సామాజిక మాధ్యమాలను అగ్రరాజ్యం​ నుంచి బహిష్కరించారు.

మరోవైపు చైనా సైతం సుంకాలతో ఎదురుదాడికి దిగటం.. అమెరికా ఎగుమతిదారులను కలవరపెట్టింది. అమెరికన్ పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. బీజింగ్​.. ఇతర దేశాల మద్దతు కూడగట్టాలని ప్రయత్నించినా సఫలీకృతం కాలేకపోయింది.

ఈ నేపథ్యంలో బైడెన్​ గద్దెనెక్కితే.. సుంకాల వాతలు కాస్త తగ్గే అవకాశం ఉందని చైనా భావిస్తోంది.

సంవాదాల్లో సైతం..

సంవాదాల్లోనూ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు చైనా దూకుడును అడ్డుకోవటంలో విఫలమయ్యారంటూ విమర్శలు చేసుకున్నారు. ఒబామా హయాంలో బైడెన్ చర్యలపై ట్రంప్​ ప్రశ్నిస్తే.. ట్రంప్​ వాణిజ్య యుద్ధాన్ని విఫలయత్నంగా కమలా హ్యారిస్ అభివర్ణించారు.

అయితే, బైడెన్ అధికారం చేపడితే.. కొన్ని అంశాల్లో బీజింగ్​తో సంబంధాలు పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బైడెన్​.. ట్రంప్​లాగా దూకుడుగా వ్యవహరించకుండా కాస్త కనికరం చూపే నేతగా చైనీయులు చూస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తైవాన్​, దక్షిణ చైనా సముద్రంపై అగ్రరాజ్యం​ వైఖరి కీలకంగా ఉండనుందన్న వాదనలున్నాయి. అమెరికా సైన్యాధికారులు మాత్రం.. చైనాతో ఎప్పటికే ప్రమాదమేనని, కొత్త ప్రభుత్వం వచ్చినా.. ఇందులో ఎటువంటి మార్పులు ఉండవంటున్నారు.

బైడెన్ చైనాకు ఒక సమస్యే. ఎందుకంటే ఆయన పరిపాలనలో చైనాపై మానవ హక్కుల ఒత్తిడి తేవచ్చు. చైనాను అడ్డుకోవటానికి మిత్రదేశాలతో కలిసి పనిచేసేందుకు.. ఆయన ప్రకటించిన విధానం ఇబ్బందులు తెస్తుంది. చైనా పురోగతిని క్లిష్టతరం చేస్తుంది.

-రాబర్ట్​ సూటర్​, చైనా వ్యవహారాల నిపుణుడు, వాషింగ్టన్​ విశ్వవిద్యాలయం

ట్రంప్​ ఎందుకు వద్దంటే..

2016 ఎన్నికల సమయంలో చైనాపై ట్రంప్ సానుకూల ధోరణే ప్రదర్శించారు. ఇది బీజింగ్​ నాయకత్వంలో ఉత్సాహం నింపింది. యూఎస్-చైనా సంబంధాలు సరికొత్త దశకు వెళ్తాయని భావించారు. అయితే, వేగంగానే కథ మొత్తం తలకిందులైంది.

అయితే, ఇప్పటికీ కొంతమంది చైనీయులు ట్రంప్​ అమెరికా అధ్యక్షుడిగా మరోసారి గెలవాలని కోరుకుంటున్నారు. చైనాను తప్పుబట్టే క్రమంలో.. ఆయన తమ దేశాన్ని ప్రపంచ శక్తిగా పరిచయం చేస్తున్నారని ఆనందిస్తున్నారు. ట్రంప్​ విధానపరమైన నిర్ణయాలు పరోక్షంగా చాలాసార్లు తమకు కలిసొచ్చాయని చెబుతున్నారు. కరోనా నియంత్రణలో ట్రంప్​ వైఫల్యం తమ దేశానికి మేలు చేసిందని భావిస్తున్నారు.

మొత్తంగా, ప్రపంచశక్తిగా తమ ఎదుగుదలకు ట్రంప్​ అడ్డుపడుతున్నారని భావిస్తున్నాయి బీజింగ్​ వర్గాలు. ట్రంప్ ఆకస్మిక విధాన మార్పులతో విసుగు చెందారు. ఈ నేపథ్యంలో బైడెన్​ గెలిస్తే.. తమ ఆటలు సాగుతాయని చైనా నాయకులు నిశ్చితాభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇదీ చూడండి: కరోనా చుట్టే ట్రంప్​-బైడెన్​ మధ్య వాడీవేడి చర్చ
ఇదీ చూడండి: 'తైవాన్​కు ఆయుధాలు అమ్మితే ప్రతీకారం తథ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.