ETV Bharat / international

'చైనా కావాలనే విదేశాలకు జనాల్ని పంపింది'

కరోనా తొలిదశలో ఉన్నప్పుడు విదేశీ ప్రయాణాలపై చైనా నిషేధం విధించకపోవడాన్ని తప్పుబట్టారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. ప్రమాదాలు సృష్టించడానికే చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందన్నారు. చైనాకు వైరస్​ గురించి ముందే తెలుసని మరోసారి అనుమానం వ్యక్తం చేశారు.

mike pompeo
మైక్ పాంపియో
author img

By

Published : May 18, 2020, 5:31 AM IST

కరోనా వైరస్ వ్యాపిస్తుందని తెలిసినా చైనా తమ పౌరులను.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించడాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తప్పుబట్టారు. అమెరికా-చైనాల మధ్య ప్రయాణాలను నిషేధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ప్రకటనను చైనా అప్పట్లో వ్యతిరేకించడాన్ని గుర్తు చేశారు. వుహాన్​లో మాత్రమే లాక్​డౌన్​ విధించి మిగిలిన ప్రజలను ఇతర దేశాలకు వెళ్లేందుకు ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు.

"తీక్షణంగా పరిశీలిస్తే.. ప్రమాదాన్ని సృష్టించిడానికే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. వైరస్​ గుర్తించిన తర్వాత చైనా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ప్రయాణించారు? చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి వైరస్ వ్యాప్తి గురించి తెలుసు. అయినా తమ దేశంలోని ఓ ప్రధాన నగరాన్ని మాత్రమే మూసేసి తన ప్రజలను చైనా వెలుపల ప్రయాణించడానికి ఎలా అనుమతించింది." -మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి

డిసెంబర్​కన్నా ముందే వైరస్​ ఉనికి గురించి చైనాకు తెలుసని ఉద్ఘాటించారు మైక్. కమ్యూనిస్టు పార్టీ తన తప్పులు తెలుసుకోడానికి ఒక రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రతి దేశం జవాబుదారీగా ఉండాల్సిందేనని అన్నారు. చైనాపై విధించే ఆంక్షలపై ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

సమాధానం దొరకాల్సిందే

వైరస్​కు మందు తయారు చేయాలంటే అది ఎక్కడి నుంచి ఉద్భవించిందో స్పష్టంగా తెలియాలన్నారు పాంపియో. పేషంట్ జీరో(తొలి పేషంట్) ఎవరు? వారికి ఎలా వైరస్ సోకింది? అన్న విషయాలపై స్పష్టత రావాలన్నారు. మరోవైపు చైనా మాత్రం ప్రతిసారి సమాచారం దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. డబ్ల్యూహెచ్​ఓను నియంత్రించడం, విషయాన్ని బయటకు చెప్పిన డాక్టర్లను శిక్షించడం వంటి చర్యలతో పారదర్శకతను గాలికొదిలేసిందని వ్యాఖ్యానించారు. అమెరికాతో పాటు ప్రపంచం అంతటికీ సమాధానం దొరకని ప్రశ్నలెన్నో ఉన్నాయని అన్నారు పాంపియో. వైరస్ సమస్య పరిష్కారానికి ఈ సమాధానాలు చాలా ముఖ్యమని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.