ETV Bharat / international

హాంగ్​కాంగ్ కేంద్రంగా చైనా, అమెరికా కొత్త ఫైట్​

హాంగ్​కాంగ్​ నిరసనల వెనుక ఆమెరికా హస్తముందని చైనా ఆరోపించింది. హాంగ్​కాంగ్​​ అల్లర్లకు అగ్రరాజ్యం మద్దతిస్తూ చైనా అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించింది.

అమెరికాపై చైనా విమర్శలు
author img

By

Published : Jul 31, 2019, 6:26 AM IST

Updated : Jul 31, 2019, 7:30 AM IST

హాంగ్​కాంగ్​ నిరసనల వెనుక అమెరికా హస్తం: చైనా

అమెరికాపై చైనా మరోసారి ఘాటు విమర్శలు చేసింది. హాంగ్​కాంగ్​​లో కొనసాగుతున్న నిరసనల వెనుక అగ్రరాజ్యం హస్తముందని ఆరోపించింది డ్రాగన్ దేశం. ఒకవైపు అమెరికాతో వాణిజ్య యుద్ధంపై చర్చలు జరుపుతున్న చైనా... మరోవైపు ఇలాంటి ఆరోపణలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

హాంగ్​కాంగ్​ నిరసనలపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో చేసిన వ్యాఖ్యలను చైనా తప్పుపట్టింది. నిరసనల విషయంలో చైనా సరైన నిర్ణయం తీసుకోవాలని ఇటీవలే అగ్రరాజ్య విదేశాంగమంత్రి వ్యాఖ్యానించారు. పాంపియో ఇంకా సీఐఏ ప్రధానాధికారిలాగే ప్రవర్తిస్తున్నారని మండిపడింది చైనా. విదేశాంగ మంత్రిగా నియమితులు కాకముందు సీఐఏ డైరెక్టర్​గా పని చేశారు పాంపియో.

'చైనా అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే..'

హాంగ్​కాంగ్ నిరసనల్లో చాలా మంది అమెరికన్లు ఉన్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చుయింగ్ ఆరోపించారు. చైనా అభివృద్ధికి ఆటంకం కలిగించడం కోసం పాశ్చాత్య దేశాలు హాంగ్​కాంగ్​ నిరసనల రూపంలో కుట్రలు పన్నుతున్నాయని చుయింగ్​ మండిపడ్డారు.

నేరపూరిత కేసుల విచారణ కోసం హాంగ్​కాంగ్ పౌరులను చైనాకు అప్పగించాలన్న బిల్లుకు వ్యతిరేకంగా ఈ ఆందోళనలు మొదలయ్యాయి. బిల్లును నిలిపివేస్తున్నట్లు హాంగ్​కాంగ్​ సీఈఓ ప్రకటించినా... ప్రజలు వెనక్కి తగ్గడంలేదు. బిల్లును పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్​తో నిరసనలు కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి: అమెరికాలో రాజకీయ పార్టీల 'స్ట్రా'ల యుద్ధం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Germany, Austria and Switzerland. Max use 90 seconds per match. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Allianz Arena, Munich, Germany. 30th July 2019.
1. 00:00 Nabil Dirar stops dribbling with the football as he is booed by his own Fenerbahce fans
2. 00:12 Nabil Dirar kicks the ball out of play and walks off the pitch
3. 00:22 Fenerbahce players convince Nabil Dirar to return to the pitch
4. 00:35 Referee Felix Brych speaks to Nabil Dirar
5. 00:40 Fenerbahce head coach Ersun Yanal gestures to the fans
6. 00:46 Various of Bayern Munich's Thomas Muller speaking to Nabil Dirar
7. 00:55 Close of Nabil Dirar on the pitch
8. 00:58 Ersun Yanal delivers a round of applause
SOURCE: Infront Sports
DURATION: 01:05
STORYLINE:
Fenerbahce's Nabil Dirar sensationally threatened to walk off the pitch after being booed by his own fans during his side's heavy 6-1 Audi Cup semi-final defeat to German heavyweights Bayern Munich at the Allianz Arena on Tuesday.
Last Updated : Jul 31, 2019, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.