లాటరీ అంటే తెలియని వారుండరు. కొందరిని ఉన్నపళంగా కోటీశ్వరులను చేస్తుంది. అలాంటి లాటరీలో గెలుపొందిన టికెట్టు పోతే... తిరిగి ఓ అనుకోని రోజున దొరికితే.. చివరి క్షణంలో కోట్ల రూపాయలు మన సొంతమైతే ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఇలాంటి సంఘటనే క్యూబెక్ నగరంలో నివసించే దంపతులకు ఎదురైంది.
నికోల్ పెడ్న్యూల్ట్, రోజర్ లారోక్యూ గత ఏడాది ప్రేమికుల రోజున లోటో క్యూబెక్ సంస్థ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. ఇంట్లోని ఓ పుస్తకంలో పెట్టి మరిచిపోయారు. ఏప్రిల్ 5, 2018 రోజున తీసిన డ్రాలో అదే టికెట్ లాటరీ గెలుపొందింది. కానీ ఆ దంపతులు ఎవరూ తమ టికెట్‌కు బహుమతి వచ్చిందని గుర్తించలేకపోయారు. అసలు టికెట్ కొనుగోలు చేసిన విషయమే మరిచారు.
వారం రోజుల క్రితం మనవడికి పాఠశాల ప్రాజెక్ట్ విషయంలో సహాయం చేయడానికి ఆ పుస్తకాన్ని తీయటం వల్ల అందులోంచి ఏదో కిందపడినట్లు గమనించారు పెడ్న్యూల్ట్. అది లాటరీలో గెలుపొందిన టికెట్‌గా గుర్తించారు. ఇంకా టికెట్ చెల్లుబాటులో ఉందని తెలుసుకుని సంస్థను సంప్రదించారు. 1 మిలియన్ కెనడా డాలర్లు ( 5 కోట్ల 13 లక్షల 41 వేల 250 రూపాయలు) సొంతం చేసుకున్నారు.
"తన ప్రదర్శన కోసం మా మనవడు ఏదైనా ఇవ్వమని నన్ను అడిగి ఉండకపోతే, నేను టికెట్‌ను ఎప్పటికీ గుర్తించలేకపోయేదానిని. మొదటగా టికెట్‌ను గుర్తించిన వెంటనే అది చెల్లుబాటు అవుతుందో లేదో లోటో క్యూబెక్ సంస్థ వెబ్‌సైట్‌ను చూశాను. " - పెడ్న్యూల్ట్