ETV Bharat / international

మరోసారి నోరుపారేసుకున్న కెనడా ప్రధాని - రైతుల ఆందోళనలు

భారత్​లో జరుగుతోన్న రైతుల ఆందోళనలపై మరోసారి నోరుపారేసుకున్నారు కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో. భారత్​ నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ.. రైతులకు మద్దతు ఇచ్చే అంశంలో తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.

Justin trudeau
కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో
author img

By

Published : Dec 6, 2020, 10:49 AM IST

అంతర్గత వ్యవహారాల్లోకి జోక్యం చేసుకోవద్దని భారత్ హెచ్చరించినప్పటికీ.. రైతుల ఆందోళనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. భారత్‌లో రైతుల ఆందోళనలకు మద్దతుగా చేసిన తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లుగా స్పష్టం చేశారు.

ప్రపంచంలో శాంతియుతంగా చేసే పోరాటాలకు కెనడా అండగా ఉంటుందని ట్రూడో కొద్ది రోజుల క్రితం వీడియో సందేశంలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ట్రూడో వ్యాఖ్యలపై కేంద్రం దీటుగా బదులిచ్చింది. ప్రజాస్వామ్య దేశాల అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం ఉండకూడదంటూ సమాధానమిచ్చింది. కెనడా హై కమిషనర్‌కు భారత్​ శుక్రవారం సమన్లు జారీ చేసింది.

ఇదీ చూడండి:ట్రూడో వ్యాఖ్యలపై కెనడా హైకమిషనర్​కు సమన్లు​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.