ETV Bharat / international

ఫైజర్ టీకా​కు కెనడా ఆమోదం

బ్రిటన్​ తర్వాత ఫైజర్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్​కు మరో దేశం ఆమోదం తెలిపింది. ఫైజర్, బయోఎన్​టెక్​ల కరోనా వ్యాక్సిన్​కు కెనాడా ఆరోగ్య సంరక్షణ నియంత్రణ విభాగం.. 'హెల్త్​ కెనడా' ఆమోద ముద్ర వేసింది.

Canada approves Pfizer's COVID-19 vaccine
ఫైజర్ వ్యాక్సిన్​కు కెనడా ఆమోదం
author img

By

Published : Dec 10, 2020, 6:25 AM IST

అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్ అభివృద్ధి చేసిన​ కొవిడ్ వ్యాక్సిన్​కు కెనడా ఆమోదం తెలిపింది. ఈ మేరకు కెనడా ఆరోగ్య సంరక్షణ నియంత్రణ విభాగం 'హెల్త్ కెనడా'.. ఫైజర్​ సహా జర్మనీకి చెందిన బయోఎన్​టెక్​ల వ్యాక్సిన్​కు ఆమోద ముద్ర వేస్తున్నట్లు తమ వెబ్​సైట్​లో ద్వారా వెల్లడించింది.

ఇందులో భాగంగా ఈ నెలలో 249,000 డోసులను, వచ్చే ఏడాది మార్చి లోపు మరో 40 లక్షల డోసులను అందుకోనుంది కెనడా.

కెనడా ప్రభుత్వం మొత్తం 2 కోట్ల డోసులను కొనుగోలు చేసింది. మరో 5.6 కోట్ల డొసులు కొనుగోలు చేసేందుకూ అవకాశం ఉంది.

మోడార్నా సహా మరో మూడు వ్యాక్సిన్​ క్యాండిడెట్లను హెల్త్ కెనడా సమీక్షిస్తోంది.

ఇదీ చూడండి:ఫైజర్ టీకాతో అలర్జీ- ప్రజలకు బ్రిటన్ హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.