భారత్ నుంచి విమానాల రాకపోకలపై విధించిన ఆంక్షలకు సంబంధించి కెనడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడిగిస్తున్నట్లు తెలిపింది. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా సెప్టెంబర్ 21 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
ఏప్రిల్‌లో.. కొవిడ్ రెండో ఉద్ధృతి దృష్ట్యా భారత్ నుంచి నేరుగా తమ దేశానికి వెళ్లే విమానాలపై బ్యాన్ విధించింది కెనడా. ఈ నేపథ్యంలో మరోసారి కెనడా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ఆ దేశ రవాణా శాఖ మంత్రి ఒమర్ అల్గబ్రా ట్వీట్ చేశారు.
అలా అయితే ఓకే..
భారత్ నుంచి నేరుగా వెళ్లే విమానాలపై నిషేధం విధిస్తున్నప్పటికీ మరో దేశం మీదుగా ప్రయాణికులు తమ దేశం చేరుకోవచ్చని కెనడా స్పష్టం చేసింది. భారత్‌లో చేయించుకున్న కొవిడ్ టెస్ట్‌ను తాము పరిగణించమని పేర్కొంది. తమ దేశానికి రావాలంటే ఇతర దేశాల్లో పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పింది.